Share News

AP Elections: చంద్రబాబుకు సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు మద్దతు

ABN , Publish Date - May 08 , 2024 | 12:25 PM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మద్దతు తెలిపారు. బుధవారం చంద్రబాబుతో సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు కలిసి టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అనంతరం సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్ రాషిద్ షరీఫ్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు టీడీపీకి మద్ధుతుగా నిలిచిందని గుర్తుచేశారు.

AP Elections: చంద్రబాబుకు సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు మద్దతు
TDP Chief Chandrababu Naidu

అమరావతి, మే 8: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు (TDP Chief Chandrababu Naidu) సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు (South Indian Muslim Personal Law Board) సభ్యులు మద్దతు తెలిపారు. బుధవారం చంద్రబాబుతో సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు కలిసి టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అనంతరం సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్ రాషిద్ షరీఫ్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు టీడీపీకి మద్ధుతుగా నిలిచిందని గుర్తుచేశారు. సెక్యులరిజానికి చంద్రబాబు ఐకాన్‌గా నిలిచారన్నారు. మత సామర్యాన్ని కాపాడటంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సూపర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..


సామాజిక సమతుల్యాన్ని చంద్రబాబు ఎల్లప్పుడూ పాటిస్తున్నారని తెలిపారు. ప్రజా రాజధానిగా అమరావతి నిర్మాణంతోనే అన్ని వర్గాలు అభివృద్ధికి సాధ్యమని వెల్లడించారు. ముస్లీంల అభివృద్ధికి తోడ్పడే మేనిఫోస్టోని ప్రకటించిన టీడీపీకి అభినందనలు తెలియజేశారు. లాల్ జాన్ భాషా వంటి నాయకులను రాజ్యసభకు పంపించిన చరిత్ర టీడీపీది అని తెలిపారు. టీడీపీ అధికారంలోకి తెచ్చేందుకు తమ ఆర్గనైజేషన్ ద్వారా సాయశక్తుల కృషి చేస్తామని స్పష్టం చేశారు. ముస్లిం... సోదర సోదరీమణులు టీడీపీకి ఓటు వేయాలని రాషిద్ షరీఫ్ పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth: రేవంత్ చేతులకు గోర్లతో రక్కిన గాయాలు.. అసలేమైంది..?

Lok Sabha Polls: యూపీలో పార్టీలకు వణుకు పుట్టిస్తున్న ఓటర్లు.. పోలింగ్ శాతంపై టెన్షన్..

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2024 | 12:46 PM