Share News

Andhra Pradesh: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. 23 మంది వాలంటీర్లు సస్పెండ్‌

ABN , Publish Date - Mar 21 , 2024 | 06:02 PM

ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కొందరు నిబంధనలను దర్జాగా ఉల్లంఘించేస్తున్నారు. నేతలే కాకుండా వాలంటీర్లు సైతం డోంట్ కేర్ అంటుండడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Andhra Pradesh: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. 23 మంది వాలంటీర్లు సస్పెండ్‌

ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కొందరు నిబంధనలను దర్జాగా ఉల్లంఘించేస్తున్నారు. నేతలే కాకుండా వాలంటీర్లు సైతం డోంట్ కేర్ అంటుండడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో 23 మంది వాలంటీర్లను సస్పెండ్‌ చేశారు. వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఇటీవల వారిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ( Elections ) కోడ్ రూల్స్ పాటించకుండా అధికార పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న 45 మంది వాలంటీర్లను అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినా వారు ఇంకా ప్రచారంలో పాల్గొంటుండటం గమనార్హం.

Trending: తాళి కట్టే సమయంలో ఫోన్ రింగ్.. రీల్ సీన్ కాదండోయ్ రియల్ సీనే.. కట్ చేస్తే..

మరోవైపు.. చిత్తూరు, కర్నూలు జిల్లాలో 35 మంది వాలంటీర్లపై ఈసీ వేటు వేసింది. అధికారపార్టీకి అనుకూలంగా వాలంటీర్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించినట్లు సమాచారం. దీంతో ఈసీ ఈ మేరకు వేటు వేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లపై గట్టిచర్యలు తీసుకుంటామని ఎన్నికల కమీషన్ హెచ్చరించింది.

Hyderabad: ఆ అధికారి చర్యతో ప్రభుత్వానికి వేల కోట్లు నష్టం.. వెలుగులోకి సంచలన విషయాలు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 21 , 2024 | 06:02 PM