Share News

AP News: నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఫోన్.. కారణమిదే..?

ABN , Publish Date - Mar 28 , 2024 | 05:16 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే పొత్తుల్లో భాగంగా కొంతమంది సీనియర్ నేతలకు టీడీపీ(TDP) టికెట్లు కేటాయించలేకపోతోంది. ఎంతోకాలంగా పార్టీ కోసం కష్టపడ్డామని ఇప్పుడు టికెట్లు ఇవ్వమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది కీలక నేతలు హై కమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించారు.

AP News: నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఫోన్.. కారణమిదే..?

తూర్పుగోదావరి: ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే పొత్తుల్లో భాగంగా కొంతమంది సీనియర్ నేతలకు టీడీపీ(TDP) టికెట్లు కేటాయించలేకపోతోంది. ఎంతోకాలంగా పార్టీ కోసం కష్టపడ్డామని ఇప్పుడు టికెట్లు ఇవ్వమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది కీలక నేతలు హై కమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించారు.

Chandrababu: జగన్ డబ్బులు ఇచ్చి.. బిర్యానీలు పెట్టినా జనం రావట్లేదు: చంద్రబాబు


అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా శివకృష్ణంరాజుని ప్రకటించారు. టీడీపీకే మొదటి నుంచి అసెంబ్లీ టికెట్ వస్తుందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భావించారు. చివరి నిమిషంలో టీడీపీకి కాకుండా బీజేపీకి కేటాయించినట్లు ప్రకటించడంతో నల్లమిల్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.నల్లమిల్లి అనుచరులు నిన్న (బుధవారం) ఆగ్రహంతో పార్టీ జెండాలు, కరపత్రాలను తగులబెట్టారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ దశలో భావోద్వేగాలు భరించలేక నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallamilli Ramakrishna Reddy) కంటతడి పెట్టుకున్నారు. ఈ విషయాన్ని చక్కదిద్దేందుకు టీడీపీ చీఫ్. మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) రంగంలోకి దిగారు.

Bhuma Akhila Priya: వైఎస్ జగన్‌‌ను కలిసేందుకు వచ్చిన అఖిల.. ఎమ్మెల్యే వర్గం రాళ్లదాడి!


నల్లమిల్లిని శాంతపరిచేందుకు రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఫోన్ చేశారు. నల్లమిల్లిని ఎలాగైనా బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుతో నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితిని, కార్యకర్తల ఆవేదనను నల్లమిల్లి వివరించారు. పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడితే తనను బలిచేశారని అధినేతకు నల్లమిల్లి ఏకరువు పెట్టారు. పార్టీ కోసం తెగించి పోరాడిన అతి కొద్దిమంది నేతలల్లో తానూ ఒకడినని నల్లమిల్లి చెప్పారు. నాడు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని పిలిచినా తమ కుటుంబం టీడీపీ వెంటే నడిచిందని తెలిపారు. 40 ఏళ్లుగా తమ కుటుంబ పోరాటాన్ని, టీడీపీ కార్యకర్తల పోరాటాన్ని గుర్తించాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబుకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

Justice NV Ramana: రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

AP News: ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలక అధికారులు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 05:30 PM