Share News

AP News: ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలక అధికారులు

ABN , Publish Date - Mar 28 , 2024 | 03:07 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలక అధికారులను నియమించింది. ఈ మేరకు ఈసీ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.

AP News: ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలక అధికారులు

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలక అధికారులను నియమించింది. ఈ మేరకు ఈసీ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. 1987 బ్యాచ్‌కి చెందిన రిటైర్డు ఐఏఎస్ అధికారి రామ్మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వర్‌గా, అలాగే 1984 బ్యాచ్‌కి చెందిన రిటైర్డు ఐపీఎఎస్ అధికారి దీపక్ మిశ్రాను స్పెషల్ పోలీస్ అబ్జర్వర్‌గా కేటాయించింది. వీరిద్దరితో పాటు 1983 బ్యాచ్‌కి చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనానిగమ్‌ను స్పెషల్ ఎక్స్‌పెండేచర్ మానిటరింగ్ సెల్‌ అబ్జర్వర్‌గా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

Chandrababu: జగన్ డబ్బులు ఇచ్చి.. బిర్యానీలు పెట్టినా జనం రావట్లేదు: చంద్రబాబు

ఈ ముగ్గురు ప్రత్యేక పరిశీలక అధికారులు నేడు(గురువారం) భారత ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగే సమావేశానికి రావాలని ఈసీ ఆదేశించింది. ఈ ముగ్గురు అధికారులు వచ్చే వారం నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను వీరు పరిశీలిస్తారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ మార్గదర్శకాలను పటిష్ఠంగా అమలు పరిచే అంశంపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఏపీ సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలతో పాటు ఓటర్లను ఆకర్షించే, ప్రేరేపించే తాయిలాల నియంత్రణపై కూడా వీరు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజన్సీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశాల్లో ఈ ముగ్గురు ప్రత్యేక పరిశీలక అధికారులు పాల్గొంటారు. ఏపీలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయనేదానిపైనా ఈ ముగ్గురు అధికారులు ఈసీకి సూచనలు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

Bhuma Akhila Priya: వైఎస్ జగన్‌‌ను కలిసేందుకు వచ్చిన అఖిల.. ఎమ్మెల్యే వర్గం రాళ్లదాడి!

Justice NV Ramana: రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 03:21 PM