Share News

Chandrababu: దుర్మార్గపు పాలనతో అమరావతిలో విధ్వంసం సృష్టించారు.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

ABN , Publish Date - Apr 07 , 2024 | 06:37 PM

దుర్మార్గపు పాలనతో అమరావతిలో సీఎం జగన్(CM Jagan) విధ్వంసం సృష్టించారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెంది ఉంటే ఈ ప్రాంతం రూపు రేఖలు మారేవని చెప్పారు. మన జీవితాలు, మన బిడ్డల భవిష్యత్తు గొప్పగా ఉండేదన్నారు.మూడు రాజధానులు అని మాట్లాడటానికి జగన్‌కు సిగ్గు, ఎగ్గు ఉందా అని నిలదీశారు.

 Chandrababu: దుర్మార్గపు పాలనతో అమరావతిలో  విధ్వంసం సృష్టించారు.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

కృష్ణా: దుర్మార్గపు పాలనతో అమరావతిలో సీఎం జగన్ (CM Jagan) విధ్వంసం సృష్టించారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెంది ఉంటే ఈ ప్రాంతం రూపు రేఖలు మారేవని చెప్పారు. మన జీవితాలు, మన బిడ్డల భవిష్యత్తు గొప్పగా ఉండేదని తెలిపారు.

మూడు రాజధానులని మాట్లాడటానికి జగన్‌కు సిగ్గు, ఎగ్గు ఉందా అని నిలదీశారు. రోడ్లపై గుంతలు పూడ్చలేడు.. కానీ మూడు రాజధానులు అంటారని మండిపడ్డారు. పామర్రులో శనివారం నాడు ‘ ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


BJP: ఏపీని డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా మార్చిన జగన్ ప్రభుత్వం: సాధినేని యామిని

అమరావతిని దేశంలో నంబర్ వన్‌...

హైదరాబాద్‌ను ఏవిధంగా అభివృద్ధి చేశానో.. అలానే అమరావతిని అభివృద్ధి చేద్దామని తపించానని చంద్రబాబు అన్నారు. తాను ఎన్నికై ఉంటే అమరావతి దేశంలో నెంబర్‌‌వన్‌గా ఉండేదని చెప్పారు. మన పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇక్కడ వచ్చేవని చెప్పారు. అమరావతి కోసం రైతులు వేల ఎకరాలు భూములు ఇచ్చారని చెప్పారు. వేల కోట్ల ఆదాయం వచ్చేదని చంద్రబాబు తెలిపారు.

ఈ దుర్మార్గుడు అమరావతికి తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ పుట్టిన నిమ్మకూరు నేలపై నుంచి మాట్లాడుతున్నానని అన్నారు. సామాన్యులు అసామాన్యులుగా మారిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని చెప్పారు. ఆయన చేసిన విధానాలతో ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నదే తన ఆశయమని చంద్రబాబు వివరించారు.


AP Politics: బస్సు యాత్రలో జగన్‌కు ఝలక్.. ఎమ్మెల్యేల ట్విస్ట్ మామూలుగా లేదు..!

రౌడీయిజాన్ని తరిమి కొట్టాలి..

తాను పేదల పక్షాన ఉంటానని నిరు పేదలను పైకి తీసుకువచ్చే బాధ్యత కూటమిదని చంద్రబాబు తెలిపారు. ఎందరో గొప్ప నేతలు పుట్టిన గడ్డ ఇదని అన్నారు. జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య, ఘంటసాల, వేటూరి, ఏఎన్‌ఆర్ వంటి వారు ఇక్కడ పుట్టారని తెలిపారు. ఇలాంటి గడ్డ పైన ఇప్పుడు గంజాయి మొక్కులు వచ్చాయని మండిపడ్డారు. అధికారం అంటే బూతులు వారికే పదవులు, ప్రమోషన్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. రౌడీయిజాన్ని తరిమి కొట్టి... అభివృద్ధికి పట్టం కట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


పోలవరం పూర్తి చేస్తాం..

యువత భవిష్యత్తుని జగన్‌రెడ్డి, అతని అనుచరులు నాశనం చేశారని విరుచుకుపడ్డారు. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేస్తామని మాటిచ్చారు. కృష్ణా డెల్టాలో మూడు పంటలు పండించాలని కోరారు. టీడీపీ హయాంలో 72 శాతం పోలవరం పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. ఈ దుర్మార్గుడు వచ్చి‌ పోలవరం పనులు ఆపేశారని మండిపడ్డారు. తాము పోలవరం పూర్తి చేస్తామని, రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

TDP: పామర్రు, ఉయ్యూరులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలు


రైతులను ఆదుకుంటా...

కౌలు రైతులు, రైతు కూలీలను ఆదుకునేలా కార్పొరేషన్ పెట్టి బాధ్యత తీసుకుంటామన్నారు. యువతలో ఉన్న ప్రతిభను గుర్తిస్తూ తగిన ఉపాధి చూపుతామన్నారు. ఈ ఐదేళ్లల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్‌ లేదు, మెగా డీఎస్సీ లేదని అన్నారు. మీలో మీరు కొట్టుకోవడం కాదని జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. యువతలో ఉన్న ఆవేశం అవినీతి పాలనను సాగనంపాలని చంద్రబాబు అన్నారు.


బాబు వస్తేనే జాబు వస్తుందని అందరూ ఇప్పుడు అంటున్నారన్నారు. తల్లిదండ్రులు ఆలోచన చేయాలని మీ పిల్లలు భవిష్యత్తును బంగారుమయం చేద్దామని అన్నారు. గంజాయి ముఠాలు కావాలా... ఉద్యోగం ఇచ్చే వాళ్లు కావాలో ఆలోచించుకోవాలని అన్నారు. మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదని చెప్పారు. ఈ సీఎం రివర్స్ పాలనతో మీ పిల్లలు జీవితాలను రివర్స్ చేశారని విరుచుకుపడ్డారు. డిగ్రీ, పీజీ చేసిన యువత కూలి పనులకు వెళ్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

AP Election 2024: చంద్రబాబుపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం సీరియస్


రూ. 3000 వేల నిరుద్యోగ భృతి

ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి రూ.3000 ఇస్తామని ప్రకటించారు. ఏడాదికి 4 లక్షలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. వర్క్ ఫర్ హోం చేసేలా ఐటీ టవర్లు నిర్మిస్తామని తెలిపారు. ఆర్ట్ ఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో మంచి భవిష్యత్తు ఇస్తామని వివరించారు. ఐటీ నిపుణులుగా ప్రపంచ దేశాలల్లో తెలుగు వారి సత్తా చాటుదామని చెప్పారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని... వైసీపీని చిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


YS Sharmila: ఏపీలో ఎక్కడ చూసిన హత్యలు, దోపిడీలే.. సీఎం జగన్‌పై షర్మిల ఫైర్

మరిన్ని ఏపీ వార్తల కోసం ...

Updated Date - Apr 07 , 2024 | 07:01 PM