Share News

Chandrababu Praja Galam Live Updates: రాప్తాడులో చంద్రబాబు ప్రజాగళం.. అదిరిపోయే స్పీచ్

ABN , First Publish Date - Mar 28 , 2024 | 11:38 AM

Praja Galam At Raptadu: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభల్లో బాబు ప్రసంగిస్తున్నారు. వైసీపీ, జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. జగన్ చేసిన తప్పొప్పులను ఒక్కొక్కటీ ఎత్తిచూపిస్తూ మరీ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు బాబు.

Chandrababu Praja Galam Live Updates: రాప్తాడులో చంద్రబాబు ప్రజాగళం.. అదిరిపోయే స్పీచ్

Live News & Update

  • 2024-03-28T12:40:17+05:30

    జగన్ మాట తప్పాడు!

    • ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదు

    • కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని జగన్ హామీ ఇచ్చారు

    • ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు

    • నెలకు రూ. 500 అదనంగా కరెంటు బిల్లు వస్తోంది

    • ఐదేళ్ల టీడీపీ హయాంలో ఎప్పుడూ కరెంట్ ఛార్జీలు పెంచలేదు

    • జగన్ హయాంలో 9 సార్లు కరెంట్ ఛార్జీల బాదుడే బాదుడు

    • రైతుల మోటర్లకు మీటర్లు బిగించి.. రైతులకు ఉరితాడు వేశాడు : చంద్రబాబు

    CBN-Nara.jpg

  • 2024-03-28T12:32:30+05:30

    • మీకు నేనున్నా..!

    • మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తా

    • నిన్నటి వరకు బెదిరించారు.. కేసులు పెట్టారు

    • ఇవాళ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు : చంద్రబాబు

    Chandrababu-Speech-1.jpg

  • 2024-03-28T12:30:45+05:30

    సూపర్.. డూపర్ హిట్!

    • మన ప్రజాగళం సూపర్ హిట్

    • జగన్ సిద్ధం కార్యక్రమం ఫ్లాప్ షో

    • జగన్ డబ్బులు ఇచ్చి.. బిర్యానీలు పెట్టినా జనం రావట్లేదు

    Chandrababu-Speech.jpg

  • 2024-03-28T12:05:15+05:30

    జన సంద్రమే..!

    • రాప్తాడులో ఎటు చూసినా జనమే

    • ఇసుకేస్తే రాలనంతగా వచ్చిన టీడీపీ శ్రేణులు, ప్రజలు

    • కాసేపట్లో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం

    • బాబు ప్రసంగం కోసం తెలుగు తమ్ముళ్లు ఎదురుచూపులు

    TDP-Public.jpg

  • 2024-03-28T11:45:26+05:30

    సారొచ్చారు!

    • రాప్తాడు చేరుకున్న చంద్రబాబు

    • ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు

    CBN.jpg

  • 2024-03-28T11:30:48+05:30

    చంద్రబాబు షెడ్యూల్ ఇదీ..

    • మదనపల్లి నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో ఉదయం 9:55 గంటలకు పయనం

    • 10.40 గంటలకు అనంతపురం శివారులోని హెలిప్యాడ్‌కు చంద్రబాబు

    • అక్కడి నుంచి రాప్తాడు బస్టాండ్ సర్కిల్‌కు చేరుకోనున్న చంద్రబాబు

    • బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగం

    • రాప్తాడు బస్టాండు దగ్గర నుంచి 12.45 గంటలకు రోడ్డు మార్గాన..

    • బయలుదేరి అనంతపురం నగర శివారులోని ఆర్డీటీ స్టేడియానికి చంద్రబాబు

    • మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ భోజన విరామం

    • రెండు గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి..

    • బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ప్రజాగళం బహిరంగ సభ వద్దకు 2:20కి చేరిక

    • 2:30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగం

    • సాయంత్రం 4:15 గంటలకు బుక్కరాయసముద్రం నుంచి బయలు దేరి..

    • 4.30 గంటలకు నగర శివారులోని హెలిప్యాడ్‌కు చేరుకోనున్న చంద్రబాబు

    • అక్కడి నుంచి కదిరి నియోజకవర్గ పర్యటనకు తిరుగుపయనం కానున్న బాబు

    Chandrababu-Helicopter.jpg

  • 2024-03-28T11:20:30+05:30

    ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభల్లో బాబు ప్రసంగించనున్నారు. టీడీ పీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయం లక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి సీబీఎన్ శ్రీకారం చుట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపే దిశగా ప్రజాగళం బహిరంగ సభ జరగనుంది. వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజాగళం వేదికగా ఉమ్మడి అనంతపురం గురించి ఏం మాట్లాడుతారు..? ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి బాబు ఏం చెప్పబోతున్నారు..? అనేదానిపై తెలుగు తమ్ముళ్లలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.