Revanth Reddy: నేనేప్పుడైనా వ్యతిరేకంగా మాట్లాడానా.. వైఎస్ జగన్‌ను ఇంటికి పిలిచి..!

ABN , First Publish Date - 2023-08-08T19:02:02+05:30 IST

సీఎం కేసీఆర్‌(CM KCR)కు తెలంగాణ(Telangana) ఆటవస్తువుగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(TPCC Chief Revanth Reddy) విమర్శించారు. మంగళవారం నాడు గాంధీభవన్‌(Gandhi Bhavan)లో రేవంత్ మీడియాతో మాట్లాడారు.

Revanth Reddy: నేనేప్పుడైనా వ్యతిరేకంగా మాట్లాడానా.. వైఎస్ జగన్‌ను ఇంటికి పిలిచి..!

ఢిల్లీ(Delhi): సీఎం కేసీఆర్‌(CM KCR)కు తెలంగాణ(Telangana) ఆటవస్తువుగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(TPCC Chief Revanth Reddy) విమర్శించారు. మంగళవారం నాడు ఢిల్లీలో(Gandhi Bhavan) రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ పట్ల నిబద్ధత కలిగి ఉన్నా. అసెంబ్లీ(Assembly) లో బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేను నేను. నన్ను తెలంగాణ ద్రోహి అంటున్నారు.మరి రేవంత్ బీఆర్ఎస్(BRS) వాడే అని అన్నారు....మరి నేను ఉద్యమంలో ఉన్నాను అని ఒప్పుకున్నారు కదా.విజయశాంతి(Vijayashanti) పార్టీని విలీనం చేయించుకొని ఆమెను మోసం చేశారు. ఆడబిడ్డను సైతం మోసం చేసిన ఘనత కేసీఆర్‌ది. ఆలే నరేంద్ర(Ale Narendra)ను చంపేసిన వ్యక్తి కేసీఆర్‌. కాంగ్రెస్(Congress) లేకపోతే కేసీఆర్‌ బిక్షం ఎత్తుకునే వాడు. మంత్రి కేటీఆర్(Minister KTR) 170 ఓట్లతో కేకే మహేందర్‌(KK Mahender)ను వెన్నుపోటు పొడిచి గెలిచాడు.కొండాలక్ష్మణ్ బాపూజీ(Kondalakshman Bapuji) చనిపోతే కేసీఆర్‌ కనీసం వెళ్లి కూడా చూడలేదు. 24 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో నేను ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు.నేను తెలంగాణకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే వీడియోలు బయట పెట్టాలి.తెలంగాణ ఉద్యమం మొత్తాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం(MIM)ను పక్కన పెట్టుకొని తిరుగుతారు.సమైక్యాంధ్ర అన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy)ని ఇంటికి పిలిచి పంచభక్షలు పెడతారా ?. ఎన్నికలు తేవాలి, కలెక్షన్ చేసుకోవాలని కేసీఆర్‌ చూస్తున్నారు.అసెంబ్లీని రాజకీయం చేశారు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 25 సీట్లు మించి రావు.రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కాంగ్రెస్‌ను దోషిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు తెలంగాణతో ఏం సంబంధం’’ అని రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆ విషయంపై కేటీఆర్ కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చారు

హైదరాబాద్ నగరం చుట్టూ పదివేల ఎకరాలు ఆక్రమించి కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెంచాలని కేసీఆర్ చూస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. జెన్వాడాలో కేటీఆర్ ఫౌంహౌస్ ధర్నాకు వెళ్తే అది ఆయనది కాదు..అన్నారు. డ్రగ్స్‌తో సంబంధం లేకపోతే కేటీఆర్ ఎందుకు పరీక్షలకు రాలేదు. ప్రతి దాంట్లో కోర్టుకు వెళ్లి మాట్లాడొద్దు.....అని అంటున్నారు.డ్రగ్స్ విచారణ కేసు విషయంలో కోర్టుకు వెళ్లాం. వైట్ పిల్ వేసి పోరాడాం. డ్రగ్స్‌తో సంబంధం లేకున్నా కేటీఆర్ కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Updated Date - 2023-08-08T19:36:08+05:30 IST