Honor 90: మూడేళ్ల తర్వాత ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ రీఎంట్రీ.. ఏకంగా 200MP కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు!

ABN , First Publish Date - 2023-09-07T18:25:00+05:30 IST

అత్యుత్తమ కెమెరా క్వాలిటీ ఉన్న మొబైల్ ఫోన్ కొనలానుకుంటున్నారా? అయితే ఈ ఇది మీ కోసమే. ఏకంగా 200 మెగా పిక్సల్ కెమెరా కల్గిన స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతుంది.

Honor 90: మూడేళ్ల తర్వాత ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ రీఎంట్రీ.. ఏకంగా 200MP కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు!

భారతదేశంలోకి 3 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రముఖ బ్రాండ్ హానర్(Honor).. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఓ 5జీ ఫోన్‌ను తీసుకురానుంది. హానర్ 90(Honor 90) అనే పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ఇప్పటికే సదరు మొబైల్ ఫోన్ కంపెనీ హెచ్‌టెక్ ప్రకటించింది. సెప్టెంబర్ 14న మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ హానర్ 90 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్(ట్విటర్) ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ యాప్ అమెజాన్‌లో(amazon) ఈ ఫోన్‌లను విక్రయించనున్నారు. కాగా హానర్ మొబైల్స్‌ను 2020 నుంచి మన దేశంలో విక్రయించడం లేదు. హానర్ 90 5జీ ఫోన్‌లో 200 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా(200-megapixel primary camera), 50 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉండడం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మార్కెట్‌లో అత్యధికంగా 108 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా కల్గిన స్మార్ట్ ఫోన్‌లు(smartphones) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కావున ప్రస్తుతం మార్కెట్‌లో కెమెరా క్వాలిటీ పరంగా హానర్ 90 ఓ రికార్డు అనే చెప్పుకోవాలి. దీంతో అత్యుత్తమ కెమెరా క్వాలిటీ ఉండాలని కోరుకునే వారికి హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్ ఉత్తమ ఎంపిక అని చెప్పుకోవచ్చు.


ఇక ఇతర ఫీచర్ల విషయానికొస్తే.. 6.7 సెంటి మీటర్ల ఫుల్ హెచ్‌డీ డీస్‌ప్లేను హానర్ 90 5జీ మోబైల్ కల్గి ఉంది. 120 హెచ్‌జడ్ రిఫ్రెష్ రేటుతో వస్తోంది. ఈ ఫోన్ బ్యాటర్ కెపాసిటీ 5,000 ఎంఏహెచ్‌గా ఉంది. 66w వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు. 1.5k రిజల్యూషన్ కలిగిన టీయూవీఎ రైన్‌ల్యాండ్ సర్టిఫైడ్ డిస్‌ప్లే ఉంది. 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. కంపెనీ ఫోన్ గురించి విడుదల చేసిన వీడియోలోనూ డిస్‌ప్లేను హైలేట్ చేశారు. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వర్షన్ 13 ఆధారిత మేజిక్ ఓఎస్ 7.1గా ఉంది. అయితే ఈ ఫోన్ ధర ఎంతనేది ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఫోన్‌ను లాంచ్ చేసే 14వ తేదీనే ధరపై కూడా స్పష్టత రానుంది. అయితే ధర రూ.35,000గా ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2023-09-07T18:28:13+05:30 IST