IND vs WI: నాలుగో టీ20లో హార్దిక్, శాంసన్, చాహల్‌, అర్ష్‌దీప్‌ను ఊరిస్తున్న రికార్డులివే!

ABN , First Publish Date - 2023-08-12T15:20:35+05:30 IST

భారత్, వెస్టిండీస్ మధ్య శనివారం నాలుగో టీ20 మ్యాచ్‌ జరగనుంది. సిరీస్‌లోని మొదటి 3 టీ20లు వెస్టిండీస్‌లో జరగగా చివరి 2 టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో గల సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ మైదానంలో జరగనున్నాయి.

IND vs WI: నాలుగో టీ20లో హార్దిక్, శాంసన్, చాహల్‌, అర్ష్‌దీప్‌ను ఊరిస్తున్న రికార్డులివే!

ఫ్లోరిడా: భారత్, వెస్టిండీస్ మధ్య శనివారం నాలుగో టీ20 మ్యాచ్‌ జరగనుంది. సిరీస్‌లోని మొదటి 3 టీ20లు వెస్టిండీస్‌లో జరగగా చివరి 2 టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో గల సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ మైదానంలో జరగనున్నాయి. ఇక సిరీస్‌లో ప్రస్తుతం 1-2తో వెనుకంజలో ఉన్న టీమిండియా నేటి మ్యాచ్‌లోనూ గెలిచి 2-2తో సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు వెస్టిండీస్ మాత్రం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఎగురేసుకుపోవాలని వ్యూహాలను రచిస్తోంది. అయితే నేడు జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, యజుర్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ రికార్డులకు చేరువలో ఉన్నారు. ఆ రికార్డులేమిటో ఒకసారి పరిశిలీద్దాం.


2- టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలర్‌గా మరో 2 వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో విదేశాల్లో 50 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. అలాగే బ్యాటర్‌గా మరో 4 ఫోర్లు బాదితే అంతర్జాతీయ టీ20ల్లో 100 ఫోర్లను పూర్తి చేసుకుంటాడు.

2- స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ మరో 2 పరుగులు చేస్తే అన్ని రకాల టీ20 క్రికెట్‌లో కలిపి 6 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.

5- లెగ్ స్పిన్నర్ చాహల్ మరో 5 వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్లన పూర్తి చేసుకుంటాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

6- పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మరో 6 వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 50 వికెట్లను పూర్తి చేసుకుంటాడు.

కాగా మన ఆటగాళ్లతోపాటు వెస్టిండీస్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, జాన్సన్ చార్లెస్ కూడా రికార్డులను అందుకునే అవకాశాలున్నాయి.

6- నికోలస్ పూరన్ మరో 6 సిక్సులు కొడితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్సులను పూర్తి చేసుకుంటాడు.

12- జాన్సన్ చార్లెస్ మరొక 12 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 1,000 పరుగులను చేరుకుంటాడు. అలాగే మరొక 5 సిక్సులు కొడితే 50 సిక్సులను పూర్తి చేసుకుంటాడు.

Updated Date - 2023-08-12T15:24:56+05:30 IST