IND vs PAK: 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన కిషన్- హార్దిక్.. ద్రావిడ్-యువీ రికార్డు గల్లంతు!

ABN , First Publish Date - 2023-09-02T21:43:41+05:30 IST

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్-హార్దిక్ పాండ్యా 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. అది కూడా టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రాహుల్ ద్రావిడ్-యువరాజ్ సింగ్‌లది కావడం గమనార్హం.

IND vs PAK: 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన కిషన్- హార్దిక్.. ద్రావిడ్-యువీ రికార్డు గల్లంతు!

కాండీ: ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్-హార్దిక్ పాండ్యా 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. అది కూడా టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రాహుల్ ద్రావిడ్-యువరాజ్ సింగ్‌లది కావడం గమనార్హం. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను ఇషాన్ కిషన్- హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. అద్భుతంగా ఆడిన వీరిద్దరు ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరు కలిసి 140 బంతుల్లో 138 పరుగులు జోడింంచారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలతో భారీ ఇన్నింగ్స్‌లు ఆడారు. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో హార్దిక్ పాండ్యా 90 బంతుల్లో 87 పరుగులు చేయగా.. 9 ఫోర్లు, 2 సిక్సులతో ఇషాన్ కిషన్ 81 బంతుల్లో 82 పరుగులు చేశాడు.


అయితే వీరు జోడించిన 138 పరుగుల భాగస్వామ్యంతో ఆసియా కప్‌లో 19 ఏళ్ల క్రితం యువరాజ్ సింగ్- రాహుల్ ద్రావిడ్ నెలకొల్పిన రికార్డు బద్దలైంది. 2004లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఐదో వికెట్‌కు రాహుల్ ద్రావిడ్(82), యువరాజ్ సింగ్(47) 133 పరుగులు జోడించారు. ఆసియా కప్ చరిత్రలో భారత్ తరఫున ఐదో వికెట్‌కు ఇప్పటివరకు ఇదే అత్యధిక భాగస్వామ్యంగా ఉంది. అయితే ఈ రికార్డును తాజాగా 138 పరుగుల భాగస్వామ్యంతో కిషన్-హార్దిక్ అధిగమించారు. అంతే కాకుండా భారత్, పాకిస్థాన్ వన్డే క్రికెట్‌లోనూ వీరిద్దరు 18 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టారు. 18 ఏళ్ల క్రితం 2005లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఐదో వికెట్‌కు రాహుల్ ద్రావిడ్-మహ్మద్ కైఫ్ 135 పరుగులు జోడించారు. ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ వన్డే పోటీల్లో ఐదో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యంగా ఉంది. తాజాగా 138 పరుగులతో కిషన్-హార్దిక్ ఆ రికార్డును అధిగమించారు.

Updated Date - 2023-09-02T21:45:52+05:30 IST