Share News

World Cup: నాలుగు స్థానాలు.. 9 జట్ల మధ్య భీకర యుద్ధం.. సెమీస్ చేరేందుకు ఏ జట్టు ఏం చేయాలంటే..?

ABN , First Publish Date - 2023-11-01T14:35:59+05:30 IST

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. టోర్నీ ఆరంభంలో కాస్త బోర్ కొట్టించినప్పటికీ క్రమక్రమంగా ఊపందుకుంది. ఇటీవల పలు ఉత్కంఠభరిత మ్యాచ్‌లతోపాటు సంచలన విజయాలు కూడా నమోదవుతున్నాయి. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టు చిత్తుగా ఓడిపోతుంటే.. అఫ్ఘానిస్థాన్ వంటి చిన్న జట్లు సంచలన విజయాలు సాధిస్తున్నాయి.

World Cup: నాలుగు స్థానాలు.. 9 జట్ల మధ్య భీకర యుద్ధం.. సెమీస్ చేరేందుకు ఏ జట్టు ఏం చేయాలంటే..?

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. టోర్నీ ఆరంభంలో కాస్త బోర్ కొట్టించినప్పటికీ క్రమక్రమంగా ఊపందుకుంది. ఇటీవల పలు ఉత్కంఠభరిత మ్యాచ్‌లతోపాటు సంచలన విజయాలు కూడా నమోదవుతున్నాయి. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టు చిత్తుగా ఓడిపోతుంటే.. అఫ్ఘానిస్థాన్ వంటి చిన్న జట్లు సంచలన విజయాలు సాధిస్తున్నాయి. దీంతో జట్లన్నీ ఇప్పటికే ఆరేసి మ్యాచ్‌ల చొప్పున ఆడినప్పటికీ కనీసం ఒక టీంకు కూడా సెమీస్ బెర్త్ ఖరారు కాలేదు. ఇప్పటివరకు ఒక్క జట్టు మాత్రమే అధికారికంగా సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించింది. కాబట్టి సెమీస్ చేరేందుకు ఇంకా 9 జట్లకు అవకాశాలున్నాయి. లీగ్ దశ పోటీలన్నీ ముగిశాక టాప్ 4లో ఉన్న జట్లు మాత్రమే నాకౌట్ దశలో అడుగుపెడతాయి. దీంతో సెమీస్ చేరేందుకు ఏ జట్టుకు ఎలాంటి అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

భారత్

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన టీమిండియా అన్నింట్లో విజయాలు సాధించింది. దీంతో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. దీంతో ప్రస్తుతం సెమీస్ బెర్త్‌కు చేరువగా ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమే. టీమిండియా తమ తర్వాతి మూడు మ్యాచ్‌లను శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లతో ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక మ్యాచ్ గెలిచినా భారత్‌కు సెమీస్‌ బెర్త్ ఖరారు అవుతుంది. లేదంటే కనీసం ఒక మ్యాచ్‌ను టై చేసుకున్న సరిపోతుంది. ఒకవేళ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే రన్ రేటు, ఇతర జట్ల ఫలితాలు కీలకం కానున్నాయి. కానీ ఈ మూడింటిలో సౌతాఫ్రికా మాత్రమే పెద్ద జట్టు. మిగిలిన శ్రీలంక, నెదర్లాండ్స్ చిన్న జట్లే. దీంతో టీమిండియా మరో మ్యాచ్ గెలిచి సెమీస్ చేరడం పెదగా కష్టం కాకపోవచ్చు. పైగా ప్రస్తుతం రోహిత్ సేన మంచి ఫామ్‌లో కూడా ఉంది.

untitled-design-2023-07-31t135327-1690791822.jpg

సౌతాఫ్రికా

టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే ఓడినా సఫారీలు ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో భారత్ తర్వాతి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లున్నాయి. ఆ జట్టు మిగిలిన 3 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, భారత్, అఫ్ఘానిస్థాన్‌లతో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో సఫారీలు కనీసం రెండు గెలిచినా, లేదంటే ఒకటి గెలిచి మరొకటి టై చేసుకున్న సెమీస్ బెర్త్ ఖరారు అవతుంది. అలా కాకుండా ఒక మ్యాచ్ గెలిచినా సెమీస్ అవకాశాలుంటాయి. ఒకవేళ మిగిలిన 3 మ్యాచ్‌ల్లో ఓడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అప్పుడు రన్ రేటు కీలకం కానుంది. కాకపోతే ప్రస్తుతం సౌతాఫ్రికాకు మంచి రన్ రేటు(+2.032) ఉంది. ప్రస్తుతం అన్ని జట్ల కంటే సౌతాఫ్రికాకే మెరుగైన రన్ రేటు ఉంది.

pakistan-vs-south-africa-head-to-head-featured-1698304307.jpg

న్యూజిలాండ్

టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచిన న్యూజిలాండ్ 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆ జట్టుకు సెమీస్ బెర్త్ ఖరారు కావాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలవాల్సి ఉంటుంది. ఒకటి గెలిస్తే ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అప్పుడు రన్ రేటు కూడా కీలకమవుతుంది. ఒకవేళ మూడింట్లో ఓడిపోతే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాగా న్యూజిలాండ్ తమ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్‌లతో ఆడనుంది.

NZvsSADream111698760221294.jpg

ఆస్ట్రేలియా

టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచిన ఆస్ట్రేలియా 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. కివీస్‌తో సమానంగా పాయింట్లున్నప్పటికీ రన్ రేటులో తేడా కారణంగా నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలంటే తమకు మిగిలిన 3 మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలవాల్సి ఉంటుంది. అలా కాకుంకా ఒకటి మాత్రమే గెలిస్తే ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కాగా కంగారులు తమ తర్వాతి మూడు మ్యాచ్‌లో ఇంగ్లండ్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో తలపడనున్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్యా ఈ మూడు జట్లను ఓడించడానికి ఆసీస్ పెదగా కష్టం కాకపోవచ్చు.

F9gQzYiXoAAwbcW.jpg


పాకిస్థాన్

టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచిన పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఆ జట్టుకు మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. ఆ రెండు మ్యాచ్‌ల్లో బలమైన న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో తలపడాల్సి ఉంది. దీంతో పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిందే. అయినప్పటికీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉన్న భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తమ తర్వాతి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. ముఖ్యంగా కివీస్, ఆసీస్, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు తమ తర్వాతి అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. కివీస్, ఆసీస్, అఫ్ఘానిస్థాన్ కనీసం రెండేసి మ్యాచ్‌లు గెలిచినా.. శ్రీలంక, నెదర్లాండ్స్ అన్ని మ్యాచ్‌లు గెలిచినా పాయింట్లు సమం అవుతాయి. అప్పుడు పాకిస్థాన్‌కు మెరుగైనా రన్‌రేటు ఉంటేనే సెమీస్ బెర్త్ దక్కుతుంది. అందుకే రాబోయే మ్యాచ్‌ల్లో విజయాలతోపాటు మెరుగైన రన్ రేటు సాధించడం కూడా పాక్‌కు ముఖ్యమే. అలా కాకుండా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచినా లేదంటే రెండూ ఓడిపోయినా సెమీస్ అవకాశాలు దాదాపుగా ఉండవు.

WhatsApp Image 2023-10-31 at 14.28.48.jpeg

అఫ్ఘానిస్థాన్

తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి అఫ్ఘానిస్థాన్ సెమీస్ రేసులో నిలిచింది. పెద్ద పెద్ద జట్లను ఓడించి ఈ ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదు చేసింది. అదే ఊపులో సెమీస్ చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన అఫ్ఘానిస్థాన్ 3 గెలిచి ఆరో స్థానంలో ఉంది. తమ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో తలపడనుంది. ఆ జట్టు సెమీస్ చేరాలంటే మిగిలిన 3 మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిందే. అదే సమయంలో రన్‌‌రేటు కూడా మెరుగుపరచుకోవాలి. అలా జరిగితే ప్రస్తుతం టాప్ 4లో ఉన్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలను అఫ్ఘాన్ జట్టు ఓడిస్తుంది. దీంతో అఫ్ఘానిస్థాన్ సెమీస్ ఆశలు మెరుగవుతాయి. అలాగే టాప్ 4లో ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తమ తర్వాతి మ్యాచ్‌ల్లో రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఓడిపోతే అఫ్ఘానిస్థాన్ సునాయసంగా సెమీస్ చేరుతుంది. అలా కాకుండా మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండే గెలిస్తే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. లేదంటే ఒకటి గెలిచినా, అన్నీ ఓడిపోయినా సెమీస్ చేరే అవకాశాలు దాదాపుగా లేనట్టే.

2haqrtq8_team-afghanistan-afp_625x300_24_August_23.jpg

శ్రీలంక, నెదర్లాండ్స్

టోర్నీలో ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్‌ల చొప్పున ఆడిన శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు రెండేసి మ్యాచ్‌ల చొప్పున గెలిచాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో శ్రీలంక ఏడో స్థానంలో, నెదర్లాండ్స్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఈ జట్లు సెమీస్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అన్నీ గెలవాలి. అది కూడా మంచి రన్ రేటుతో గెలవాల్సి ఉంటుంది. అప్పుడే 5 విజయాలతో సెమీస్ రేసులో ఉంటాయి. అప్పుడు కూడా సెమీస్ బెర్త్ ఖరారు కాదు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా టాప్ 4లో ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తమ తర్వాతి మ్యాచ్‌ల్లో రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఓడిపోవాలి. అలాగే పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ జట్లు కూడా తమ తర్వాతి మ్యాచ్‌ల్లో ఓడాల్సి ఉంటుంది.

బంగ్లాదేశ్, ఇంగ్లండ్

7 మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుత టోర్నీలో సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన మొదటి జట్టు బంగ్లాదేశ్‌నే కావడం గమనార్హం. ఇక చివరగా ఇంగ్లండ్ జట్టు విషయానికొస్తే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచింది. అధికారికంగా ఖరారు కాకపోయినప్పటికీ ఇంగ్లండ్ కూడా సెమీస్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్టే. ఆ జట్టు మిగిలిన 3 మ్యాచ్‌ల్లో గెలిచిన సెమీస్ బెర్త్ కష్టమే. ఒకవేళ ఇంగ్లండ్ సెమీస్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే.

Updated Date - 2023-11-01T14:35:59+05:30 IST