Share News

Boxing Day: బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి? దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?..

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:02 PM

క్రికెట్‌లో బాక్సింగ్ డే కు మంచి ప్రాముఖ్యత ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఏడాది బాక్సింగ్ డే రోజున ముఖ్యమైన టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభవుతుంటాయి. వాటిని బాక్సింగ్ డే టెస్టులు అని పిలుస్తుంటారు. ఆయా క్రికెట్ బోర్డులు కూడా బాక్సింగ్ డే రోజున తమ జట్ల మ్యాచ్‌లు జరిగేలా షెడ్యూల్ చేస్తుంటాయి.

Boxing Day: బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి? దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?..

క్రికెట్‌లో బాక్సింగ్ డే కు మంచి ప్రాముఖ్యత ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఏడాది బాక్సింగ్ డే రోజున ముఖ్యమైన టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభవుతుంటాయి. వాటిని బాక్సింగ్ డే టెస్టులు అని పిలుస్తుంటారు. ఆయా క్రికెట్ బోర్డులు కూడా బాక్సింగ్ డే రోజున తమ జట్ల మ్యాచ్‌లు జరిగేలా షెడ్యూల్ చేస్తుంటాయి. ఈ సంవత్సరం కూడా బాక్సింగ్ డే రోజున రెండు టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. అది ఒకటి సెంచూరియన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మొదటి టెస్ట్ కాగా, రెండోది ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్. ఈ నేపథ్యంలో అసలు బాక్సింగ్ డే అంటే ఏమిటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది. క్రికెట్‌లో బాక్సిండ్ డే కు ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.


బాక్సిండే అంటే ఏమిటి?

ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు. మరుసటి రోజు డిసెంబర్ 26ను బాక్సింగ్ డేగా పిలుస్తారు. డిసెంబర్ 26ను బాక్సిండ్ డే అని ఎందుకు పిలుస్తారనే విషయమై అనేక కథనాలు ఉన్నాయి. పలువురు ఉద్యోగులు క్రిస్మస్ రోజున సెలవు తీసుకోకుండా పనిచేస్తారు. దీంతో వారికి మరుసటి రోజున సెలవు ఇచ్చి బాక్స్‌ల రూపంలో బహుమతులు ఇస్తుంటారు. అందుకే డిసెంబర్ 26ను బాక్సిండ్ అని పిలుస్తారనేది ఒక కథనం. క్రిస్మస్ మొదటి రోజున వ్యాపారులు, ఇతర రంగాల వారు డబ్బు, బహుమతులను కలిగి ఉంటారు. ఒక సంవత్సరం కష్టానికి దీనిని రివార్డుగా భావిస్తారు. అందుకే మరుసటి రోజును బాక్సిండ్ అని పిలుస్తారనేది మరొక కథ. సమాజంలోని పేద వారి కోసం చందాలు సేకరించి వాటిని క్రిస్మస్ మరుసటి రోజున చర్చిల్లో ఉంచుతారు. దాని వల్ల కూడా బాక్సిండ్ డే అని పేరు వచ్చిందని మరికొందరు నమ్ముతారు.

బ్రిటన్ గర్వించదగ్గ నావికా సంప్రదాయం నుంచి వచ్చిందని మరికొందరు నమ్ముతారు. ఇందులో సుదీర్ఘ ప్రయాణాల కోసం మూసి ఉన్న పెట్టెల్లో డబ్బు దాచి ఉంచడం, సముద్రయానం విజయవంతమైతే దానిని పేదలకు పంచడానికి పూజారికి ఇస్తారు. మరొక కథ ప్రకారం 1800వ సంవత్సరంలో ఇంగ్లాండ్‌లో విక్టోరియా మహారాణి సింహాసనాన్ని అధిష్టించిన రోజును బాక్సిండ్ డే అని పిలుస్తారు. బాక్సిండే సందర్భంగా క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం 19వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. మొదటిసారిగా 1865లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో విక్టోరియా, న్యూసౌత్ వేల్స్ మధ్య బాక్సింగ్ డే సందర్భంగా షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ జరిగింది. అప్పుటి నుంచి ప్రతి ఏడాది బాక్సిండే టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 01:02 PM