Share News

Rohit sharma: రోహిత్ శర్మ అలసిపోయాడు.. దిగ్గజ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 18 , 2023 | 02:03 PM

Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలను అప్పగించడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.

Rohit sharma: రోహిత్ శర్మ అలసిపోయాడు.. దిగ్గజ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలను అప్పగించడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఓ క్రీడా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ అంశంపై స్పందించాడు. ఈ క్రమంలో ముంబై కెప్టెన్సీ మార్పుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని చెప్పుకొచ్చాడు. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఐపీఎల్‌లో రోహిత్ శర్మ రాణించలేకపోయాడని, బహుషా నిరంతరం క్రికెట్ ఆడడం వల్ల కొంచెం అలసిపోయి ఉండవచ్చని అన్నాడు. ‘‘మనం హక్కులు, తప్పుల జోలికి వెళ్లకూడదు. కానీ వారు తీసుకున్న నిర్ణయం జట్టు ప్రయోజనాల కోసమే. గత రెండేళ్లలో బ్యాట్‌తో రోహిత్ సహకారం కొద్దిగా తగ్గింది. అంతకుముందు అతను పెద్ద స్కోర్లు చేసేవాడు. వారు(ముంబై ఇండియన్స్) చివరి సంవత్సరం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించారు. కానీ అంతకుముందు రెండు సంవ్సరాలు పాయింట్ల పట్టికలో 9, 10వ స్థానంలో నిలిచారు.


గత కొన్నేళ్లుగా మనం రోహిత్ శర్మలోని మునుపటి సత్తాను చూడలేకపోయాం. బహుషా అతను నిరంతరం క్రికెట్ ఆడడం వలన అలసిపోయి ఉండవచ్చు. టీమిండియాకు, ఫ్రాంచైజీ క్రికెట్‌కు కెప్టెన్సీ చేయడం వల్ల రోహిత్ శర్మ కొంచెం అలసిపోయినట్టు ఉన్నాడు. యువ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా మంచి ఫలితాలు సాధించాడని దృష్టిలో ఉంచుకుని వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు నేను భావిస్తున్నాను. హార్దిక్ గుజరాత్‌ను రెండు సార్లు ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. 2022లో ట్రోఫి కూడా గెలిపించాడు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని వారు హార్దిక్‌ను కెప్టెన్‌గా చేశారని నేను భావిస్తున్నాను.’’ అని సునీల్ గవాస్కర్ చెప్పాడు. కాగా 2013, 2015, 2017, 2019, 2020లో ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను రోహిత్ శర్మ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అయితే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఐపీఎల్‌లో అద్భుత శకానికి ముగింపు పడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 18 , 2023 | 02:03 PM