Share News

World Cup: విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2023-11-16T08:48:03+05:30 IST

PM Narendra modi: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీస్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన తుది పోరుకు అర్హత సాధించింది. నేక మంది ప్రముఖుల నుంచి టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సైతం సెమీ ఫైనల్‌లో భారత జట్టు ప్రదర్శనకు ఫిదా అయిపోయారు.

World Cup: విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ

ముంబై: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీస్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన తుది పోరుకు అర్హత సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో టీమిండియా 70 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 7 వికెట్లతో విశ్వరూపం చూపించిన మహ్మద్ షమీ, సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో టీమిండియాపై అంతటా ప్రశంసలు కురిపిస్తున్నాయి. అనేక మంది ప్రముఖుల నుంచి టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సైతం సెమీ ఫైనల్‌లో భారత జట్టు ప్రదర్శనకు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో టీమిండియాపై, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మహ్మద్ షమీ, విరాట్ కోహ్లీపై మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆయన అభినందనలు తెలిపారు.


‘‘టీమిండియాకు అభినందనలు. భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, విశేషమైన శైలిలో ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. అద్భుతమైన బ్యాటింగ్, మంచి బౌలింగ్‌ మన జట్టుకు మ్యాచ్‌ను అందించింది. ఫైనల్ మ్యాచ్‌కు శుభాకాంక్షలు’’ అని టీమిండియాను ప్రధాని మోదీ కొనియాడారు.

‘‘ఈ రోజు విరాట్ కోహ్లీ తన 50వ వన్డే సెంచరీని సాధించడమే కాకుండా అత్యుత్తమ క్రీడా స్ఫూర్తిని నిర్వహించే శ్రేష్టతకు, పట్టుదలకు ఉదాహరణగా నిలిచారు. ఈ అద్భుతమైన మైలురాయి ఆయన నిరంతర అంకితభావానికి, అసాధారణమైన ప్రతిభకు నిదర్శనం. నేను ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భవిష్యత్ తరాలకు ఆయన ఒక బెంచ్ మార్కును నెలకొల్పుతూనే ఉన్నారు.’’ అని కింగ్ కోహ్లీపై ప్రధాని ప్రశంసలు కురిపించారు.

‘‘నేటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లోని అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలకు మరింత ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ కనబర్చిన మహ్మద్ షమీని, ఈ ప్రపంచకప్ ద్వారా క్రికెట్ ప్రేమికులు, భవిష్యత్ తరాలు ఎంతో ఆదరిస్తారు. షమీ బాగా ఆడారు.’’ అని మోదీ ట్వీట్ చేశారు.

Updated Date - 2023-11-16T08:49:47+05:30 IST