Viral News: ఫైవ్‌స్టార్ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా పాడు పని.. ఈ 23 ఏళ్ల యువతికి కోట్లలో ఆస్తి ఎలా వచ్చిందా అని ఆరా తీస్తే..!

ABN , First Publish Date - 2023-05-04T16:29:48+05:30 IST

అప్పటిదాకా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కొందరు.. ఉన్నట్టుండి లక్షాధికారులుగా మారిపోతుంటారు. వీరిలో కొందరు సక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తే.. మరికొందరు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటుంటారు. మరికొందరు మరింత దురాశతో ఎలాంటి నీచమైన పనులు చేయడానికైనా...

Viral News: ఫైవ్‌స్టార్ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా పాడు పని.. ఈ 23 ఏళ్ల యువతికి కోట్లలో ఆస్తి ఎలా వచ్చిందా అని ఆరా తీస్తే..!
ప్రతీకాత్మక చిత్రం

అప్పటిదాకా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కొందరు.. ఉన్నట్టుండి లక్షాధికారులుగా మారిపోతుంటారు. వీరిలో కొందరు సక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తే.. మరికొందరు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటుంటారు. మరికొందరు మరింత దురాశతో ఎలాంటి నీచమైన పనులు చేయడానికైనా వెనుకాడరు. ఇటీవల మహిళలు కూడా ఇలాంటి పనులు చేసి పోలీసులకు దొరికిపోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫైవ్‌స్టార్ హోటల్‌లో స్వీపర్‌గా పని చసే 23 ఏళ్ల పని మనిషికి.. ఉన్నట్టుండి కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. చివరకు ఆమె చేసిన పని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

బ్రిటన్‌లోని (Britain) బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీపంలోని హిల్టన్ అనే ఫైవ్ స్టార్ హోటల్లో (Five star hotel) సబ్రీనా అనే 23 ఏళ్ల యువతి (woman) పని స్వీపర్‌గా (sweeper) పని చేస్తుంటుంది. ఈమె జీతం అంతంతమాత్రమే కావడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడేది. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ఆలోచించింది. చివరకు ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. హోటల్‌కి వచ్చే ధనవంతులను టార్గెట్ చేసింది. వీఐపీ అతిథుల గదుల్లోకి క్లీనింగ్ పని పేరుతో వెళ్లడం, చివరకు లోపల ఉన్న విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడం చేసేంది. ఈ క్రమంలో ఖరీదైన గడియారాలు, క్రెడిట్ కార్డులు, నగదు, నగదు (Credit cards, jewelry, cash) చోరీ చేసేది. ఇలా మొత్తం రూ.4కోట్ల విలువైన వస్తువులను చోరీ చేసింది.

Selfie with Train: హైదరాబాద్‌లో 5 ఏళ్ల క్రితం నాటి ఘటనకు సంబంధించిన వీడియో మళ్లీ వైరల్‌.. అసలు ఈ కుర్రాడికి ఏమైందంటే..!

women-crime.jpg

ఇటీవల కొందరు వీఐపీలు.. తమ వస్తువులు కనిపించడం లేదని హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో చివరకు హోటల్ యాజమాన్యం.. తమ సిబ్బందిపై నిఘా ఉంచింది. ఈ క్రమంలో హోటల్లోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించగా సబ్రీనా నిర్వాకం వెలుగులోకి వచ్చింది. చివరకు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.1కోటి విలువైన నగలు, వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తక్కువ జీతంతో స్వీపర్‌గా పని చేస్తూ.. చివరకు అక్రమంగా కోట్లు సంపాదించిన సబ్రీనా ఉదంతం.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

20 ఏళ్ల తర్వాత అందిన సంతానం.. ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరి.. ఒకే ఒక్క ఘటనతో..

Updated Date - 2023-05-04T16:32:33+05:30 IST