Shocking Video: పిండి మెషీన్‌ కంటే నాకే బలం ఎక్కువ అని ఆ కుర్రాడికి అతి నమ్మకం.. బెల్టును లాగి పట్టుకున్నాక మెషీన్‌ను ఆన్ చేయగానే..

ABN , First Publish Date - 2023-05-03T18:37:26+05:30 IST

నేనే బలవంతుడిని, నాకంటే శక్తివంతులు ఎవరూ లేరు.. అనుకుంటూ చాలా మంది మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు సాటి వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తే.. మరికొందరు తమ ప్రతాపాన్ని మూగ జీవాలపై చూపిస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో..

Shocking Video: పిండి మెషీన్‌ కంటే నాకే బలం ఎక్కువ అని ఆ కుర్రాడికి అతి నమ్మకం.. బెల్టును లాగి పట్టుకున్నాక మెషీన్‌ను ఆన్ చేయగానే..

నేనే బలవంతుడిని, నాకంటే శక్తివంతులు ఎవరూ లేరు.. అనుకుంటూ చాలా మంది మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు సాటి వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తే.. మరికొందరు తమ ప్రతాపాన్ని మూగ జీవాలపై చూపిస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు కథ అడ్డం తిరుగుతుంటుంది. ఏదో చేయబోతే.. ఇంకేదో జరిగినట్లు.. అప్పటిదాకా విర్రవీగవీగిన వారు చివరకు కోలుకోలేని దెబ్బ తింటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కుర్రాడు.. పిండి మిషన్ కంటే నాకే బలం ఎక్కువ అనుకుని విర్రవీగాడు. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి తన స్నేహితుల ముందు పందెం కాస్తాడు. పిండి మిషన్ (Flour Mission) కంటే నాకే బలం ఎక్కువ ఉందంటూ పోటీకి సిద్ధమవుతాడు. ఓ పిండి మిషన్ వద్దకు వెళ్లి నిలబడి.. మిషన్ బెల్టును పట్టుకుంటే ఆన్ చేసినా తిరగదు అంటూ బిల్డప్ ఇస్తాడు. ఆ వెంటనే బెల్టును పట్టుకుని, మిషన్‌ను ఆన్ చేయమంటూ స్నేహితులకు చెబుతాడు. స్విచ్ ఆన్ చేయగానే బెల్టు స్పీడ్‌గా తిరుగుతుంది. దీంతో అప్పటి దాకా బెల్టును గట్టిగా పట్టుకుని ఉన్న వ్యక్తి.. ఒక్కసారిగా దాంతో పాటే వచ్చి ఎగిరి నేలపై పడతాడు.

Viral News: ఆపరేషన్ చేసుకున్నా కూడా గర్భవతిని ఎలా అయ్యానంటూ ఓ మహిళకు డౌట్.. జరిగింది తెలిసి న్యాయపోరాటం.. చివరకు..

ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఇలాంటి మూర్ఖులు కూడా ఉంటారా’’.. అని కొందరు, ‘‘అతి ఆత్మవిశ్వాసం పనికి రాదు’’.. అని మరికొందరు, ‘‘అతడికి ఏమీ కాకూడదని కోరుకుంటున్నాం’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి..

Viral Video: ప్రియురాలితో హోటల్లో ఉన్న భర్త.. విషయం తెలిసి సడన్ ఎంట్రీ ఇచ్చిన భార్య.. ఇద్దరినీ కూర్చోబెట్టి..

Updated Date - 2023-05-03T18:37:26+05:30 IST