Crime News: బాబోయ్.. మార్చురీలోని శవాలతోనే వ్యాపారం.. చచ్చిన వాళ్లను పార్టులు పార్టులుగా చేసి మరీ అమ్మేస్తున్న 36 ఏళ్ల మహిళ..!

ABN , First Publish Date - 2023-05-02T21:44:58+05:30 IST

కొందరు నేరస్థుల ప్రవర్తన చాలా క్రూరంగా ఉంటుంది. డబ్బులు కోసం ఎంతకు తెగించడానికైనా వారు వెనుకాడరు. ఇటీవల చాలా మంది మహిళలు కూడా దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. తాజగా, ఓ మహిళకు సంబంధించిన వార్త..

Crime News: బాబోయ్.. మార్చురీలోని శవాలతోనే వ్యాపారం.. చచ్చిన వాళ్లను పార్టులు పార్టులుగా చేసి మరీ అమ్మేస్తున్న 36 ఏళ్ల మహిళ..!
ప్రతీకాత్మక చిత్రం

కొందరు నేరస్థుల ప్రవర్తన చాలా క్రూరంగా ఉంటుంది. డబ్బులు కోసం ఎంతకు తెగించడానికైనా వారు వెనుకాడరు. ఇటీవల చాలా మంది మహిళలు కూడా దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. తాజగా, ఓ మహిళకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చులో పని చేస్తున్న మహిళ.. చచ్చిన వాళ్లను పార్టులు పార్టులు చేసి మరీ విక్రయిస్తోంది. శవాలతో వ్యాపారం చేస్తున్న ఈమె గురించి బయటికి తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని (America) అర్కాన్సాస్‌కు చెందిన కాండేస్ స్కాట్ అనే 36ఏళ్ల మహిళ స్థానికంగా ఉన్న ఓ మార్చురీలో (Mortuary) పని చేస్తుంటుంది. ఇందులో భాగంగా మానవ అవశేషాలను రవాణా, దహనం తదితర పనులు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు 2021లో ఫేస్‌బుక్‌లో (Facebook) పెన్సిల్వేనియాకు చెందిన ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మహిళ పని గురించి తెలుసుకున్న అతను.. ఆమెతో మానవ అవయవాలను (Human organs) విక్రయించేలా ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత సదరు మహిళ ఓ మెడికల్ కళాశాల (Medical College) నుంచి మానవ పుర్రె, దంతాలు, మెదడు తదితరాలను చోరీ చేసి సదరు వ్యక్తి 11వేల డాలర్లకు విక్రయించింది.

Viral Video: వామ్మో.. ఈ పరాటాను తినాలంటే మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచిస్తారేమో.. దీన్ని అసలు ఎలా చేశారో చూస్తే..!

అప్పటి నుంచి సుమారు తొమ్మిది నెలల పాటు పలుమార్లు అమె.. మూత్రపిండాలు, గుండె, ఉపిరితిత్తులు.. ఇలా శరీర భాగాలను (Sale of human organs) అక్రమంగా విక్రయిస్తూ వచ్చింది. ఇటీవల ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 20 బాక్సుల మావన శరీరాలను విక్రయించినట్లు విచారణలో తేలింది. ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral news) మారింది. దీంతో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Viral News: ఆపరేషన్ చేసుకున్నా కూడా గర్భవతిని ఎలా అయ్యానంటూ ఓ మహిళకు డౌట్.. జరిగింది తెలిసి న్యాయపోరాటం.. చివరకు..

Updated Date - 2023-05-02T21:44:58+05:30 IST