Viral Video: మందు కొట్టి పరాయి మహిళతో చిందేస్తున్న భర్త.. తన ఎదుటే డాన్స్ వేయాలని కోరిన భార్య.. చివరకు ఊహించని విధంగా..

ABN , First Publish Date - 2023-05-02T14:59:33+05:30 IST

భర్తకు తెలీకుండా భార్య, భార్యకు తెలీకుండా భర్త చేసే పనులు కొన్నిసార్లు చాలా దూరం వెళ్తుంటాయి. ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో..

Viral Video: మందు కొట్టి పరాయి మహిళతో చిందేస్తున్న భర్త.. తన ఎదుటే డాన్స్ వేయాలని కోరిన భార్య.. చివరకు ఊహించని విధంగా..

భర్తకు తెలీకుండా భార్య, భార్యకు తెలీకుండా భర్త చేసే పనులు కొన్నిసార్లు చాలా దూరం వెళ్తుంటాయి. ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో దంపతులు బహిరంగంగా దాడులు చేసుకోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఫుల్‪‌గా మందు కొట్టి.. పబ్‌లో పరాయి మహిళతో డాన్స్ చేస్తుంటాడు. ఆ సమయంలో ఉన్నట్లుండి అతడి భార్య లోపలికి వస్తుంది. తన ఎదుటే డాన్స్ వేయాలని కోరిన భార్య చివరకు ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. ఓ వ్యక్తి పబ్‌లో మందు కొట్టి ఎంజాయ్ చేస్తుంటాడు. తర్వాత అక్కడే ఉన్న పరాయి మహిళతో (woman) ఖుషీ ఖుషీగా డాన్స్ (Dance) చేస్తుంటాడు. ఇలా రెండు మూడు స్టెప్పులు వేయగానే సడన్‌గా అక్కడికి అతడి భార్య ఎంటరవుతుంది. నేరుగా వెళ్లి వాళ్లిద్దరి మధ్యలో నిలబడుతుంది. దీంతో అప్పటిదాకా సరదగా డాన్స్ చేస్తున్న భర్త.. సడన్‌గా షాక్ అవుతాడు. భర్త వైపు కోపంగా చూసిన ఆమె చివరకు కాలికి ఉన్న చెప్పు తీసుకుంటుంది. ‘‘ఏదీ నా ముందు ఇంకోసారి అదే స్టెప్పులు వేయడం చూద్దాం’’.. అని అంటుంది. దీంతో భర్త తప్పు చేసిన వాడిలా అలాగే నిలబడిపోతాడు.

Viral News: వాంతి వస్తుండడంతో కారు ఆపిన వరుడు.. వెంటనే వాహనం దిగి కేకలు పెట్టిన వధువు.. చివరకు ఆమె తండ్రి వచ్చి అసలు విషయం చెప్పడంతో..

తర్వాత ఆమె మరింత కోపంతో భర్త జుట్టు పట్టుకుని (Wife attacked husband) కొడుతుంది. కాస్త దూరంగా ఉన్న యువతిని భర్త వద్దకు తీసుకొచ్చి, భర్త వేసిన స్టెప్పును వ్యంగ్యంగా అనుకరిస్తూ.. ‘‘ఈ స్టెప్పు మళ్లీ వెయ్ చూద్దాం’’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో భర్త మరింత భయపడిపోతాడు. అక్కడే ఉన్న యువతి ఎందుకొచ్చిన సమస్య అనుకున్నట్లు కిక్కురుమనకుండా నిలబడి ఉంటుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భర్తను బాగానే కంట్రోల్ చేసింది’’.. అంటూ కొందరు, ‘‘ఈ రోజు ఇతడి పని అయిపోయినట్టే’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Crime news: అప్పు తీర్చని మహిళకు రుణదాత చివరి సలహా.. అతడి మాటలకు షాక్ అయిన ఆమె.. ఇష్టం లేకున్నా చివరకు..

Updated Date - 2023-05-02T14:59:33+05:30 IST