Viral Video: బైకుపై వెళ్లేవాడు వెళ్లకుండా వీడు చేసిన పనికి.. అయిందా... బాగా అయిందా.. అంటూ నెటిజన్ల సెటైర్లు..

ABN , First Publish Date - 2023-04-30T21:54:21+05:30 IST

చెడు చేసిన వారు చివరకు శిక్ష అనుభవించక తప్పదు. కొన్నిసార్లు తప్పు చేసిన మరుక్షణమే గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుంది. చాలా మంది ఆకతాయిలు నిస్సహాయులపై తమ ప్రతాపం చూపి పైశాసిక ఆనందం పొందుతుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు..

Viral Video: బైకుపై వెళ్లేవాడు వెళ్లకుండా వీడు చేసిన పనికి.. అయిందా... బాగా అయిందా.. అంటూ నెటిజన్ల సెటైర్లు..

చెడు చేసిన వారు చివరకు శిక్ష అనుభవించక తప్పదు. కొన్నిసార్లు తప్పు చేసిన మరుక్షణమే గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుంది. చాలా మంది ఆకతాయిలు నిస్సహాయులపై తమ ప్రతాపం చూపి పైశాసిక ఆనందం పొందుతుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు.. ‘‘ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయం బాబోయ్!’’.. అనేలా ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. బైకుపై వెళ్తున్న ఓ యువకుడు ఉన్నట్టుండి చేసిన ఆకతాయి పనికి చివరికి షాక్ అవ్వాల్సి వస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు (Viral Videos) కొడుతోంది. ఇద్దరు యువకులు (young people) బైకుపై వెళ్తుంటారు. వెనుక పక్క కూర్చున్న యువకుడు చేసిన పనికి, బైకు నడుపుతున్న వ్యక్తి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మార్గ మధ్యలో వారికి ఏ గేదెల మంద ఎదురవుతుంది. ఓ గేదె రోడ్డు పక్కన నిలబడి ఉంటుంది. బైకు సమీపానికి రాగానే వెనుక వైపు కూర్చున్న వ్యక్తి.. సడన్‌గా కాలు పైకి ఎత్తి (young man kicked a buffalo) గేదెను తన్నుతాడు. దీంతో వెంటనే బైకు అదుపు తప్పి ధమేల్‌మని ఇద్దరూ కిందపడిపోతారు.

Viral Video: గొరిల్లా ముందు జస్ట్ చేతులు చాపాడంతే.. చివరకు దాని రియాక్షన్ చూసి అంతా షాక్..

వెనుక కూర్చున్న వ్యక్తి మాత్రం రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి పడిపోతాడు. వీరి వెనుకే వస్తున్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) పెడుతున్నారు. ‘‘ మూగ జీవాలే కదా.. ఏం చేస్తాయిలే అనుకుంటే ఇలాగే జరుగుతుంది’’.. అని కొందరు, ‘‘వీడికి ఇలా అవ్వాల్సిందే’’.. అని ఇంకొందరు, ‘‘అయిందా.. బాగా.. అయిందా’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral News: వాంతి వస్తుండడంతో కారు ఆపిన వరుడు.. వెంటనే వాహనం దిగి కేకలు పెట్టిన వధువు.. చివరకు ఆమె తండ్రి వచ్చి అసలు విషయం చెప్పడంతో..

Updated Date - 2023-04-30T21:54:21+05:30 IST