Viral news: చదువుకున్న బ్యాచ్‌లర్స్ కదా అని ఇల్లు అద్దెకిస్తే.. ఎంత పని చేశారో చూడండంటూ ఫొటోలను బయటపెట్టిన యజమాని..

ABN , First Publish Date - 2023-04-28T20:00:16+05:30 IST

బ్యాచ్‌లర్స్ గదులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అపరిశుభ్రతతో పాటూ ఇంటి నిండా చిందరవందరగా పడేసిన దుస్తులు, చెత్తాచెదారం దర్శనమిస్తుంటుంది. దీనికితోడు కొందరు యువకులు చేసే అల్లరికి ..

Viral news: చదువుకున్న బ్యాచ్‌లర్స్ కదా అని ఇల్లు అద్దెకిస్తే.. ఎంత పని చేశారో చూడండంటూ ఫొటోలను బయటపెట్టిన యజమాని..
ప్రతీకాత్మక చిత్రం

బ్యాచ్‌లర్స్ గదులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అపరిశుభ్రతతో పాటూ ఇంటి నిండా చిందరవందరగా పడేసిన దుస్తులు, చెత్తాచెదారం దర్శనమిస్తుంటుంది. దీనికితోడు కొందరు యువకులు చేసే అల్లరికి పక్కన ఉన్న వారు కూడా అసహ్యించుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కారణాలతో పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఎక్కడైనా అద్దె ఇల్లు వెతుక్కోవడం.. బ్యాచ్‌లర్స్‌కు పెద్ద సమస్యగా మారుతుంటుంది. టూలెట్ బోర్డులు (Tolet board) కనిపించినా చాలా వరకు అందులో ఫ్యామిలీకి మాత్రమే అని రాసి ఉంటుంది. కొన్నిసార్లు కాళ్లరిగేలా తిరిగిలా ఫలితం ఉండదు. ఒకవేళ ఇల్లు దొరికినా.. యజమానులు చాలా కండీషన్స్ పెట్టి మరీ అనుమతి ఇస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే బెంగళూరుకు చెందిన ఓ ఇంటి యజమానికి విచిత్ర అనుభవం ఎదురైంది. చదువుకున్న బ్యాచ్‌లర్స్ కదా అని ఇల్లు అద్దెకిస్తే.. ఎంత పని చేశారో చూడండంటూ.. ఫొటోలను షేర్ చేసి మరీ తన ఆవేదనను వ్యక్తం చేశాడు..

సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్‌గా (Viral news) మారింది. బెంగళూరుకు (Bangalore) చెందిన ఓ అపార్ట్‌మెంట్‌ యజమానికి విచిత్ర సమస్య వచ్చి పడింది. చదువుకున్న బ్యాచ్‍‌లర్స్ (Bachelors) కావడంతో రెండు బెడ్‌రూంల ఇంటిని అద్దెకు (Rented house) ఇచ్చాడు. నెలకు రూ.17,000 అద్దెతో పాటూ సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.85,000 తీసుకున్నాడు. ఇంత వరకూ ఎలాంటి సమస్య లేదు గానీ.. ఆ తర్వాతే అసలైన సమస్య వచ్చి పడింది. నాలుగు నెలల అనంతరం సదరు బ్యాచ్‌లర్స్ ఉన్నట్టుండి ఇంటిని ఖాళీ చేశారు. యజమానికి ఫోన్ చేసి విషయం తెలియజేశారు. అయితే తర్వాత ఇంట్లోకి వెళ్లి చూసిన యజమాని షాక్ అయ్యాడు. ఇంటి నిండా బీరు బాటిళ్లు, చెత్తాచెదారం ఉండడం చూసి షాక్ అయ్యాడు.

సహోద్యోగితో యువతి స్నేహం.. నాలుగేళ్ల తర్వాత ఉన్నట్టుండి అదృశ్యమైన యువకుడు.. చివరకు ఆస్పత్రిలో వైద్యుని సంప్రదించగా..

సదరు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. శుభ్రంగా ఉన్న తన ఇంటిని పాడుబడ్డ గదిలా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral photos) మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరులో ఇళ్ల యజమానులు కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని.. వేలకు వేల రూపాయల బాడుగ తీసుకోవడంతో పాటూ 6నుంచి 10నెలల అడ్వాన్స్ తీసుకుంటారని చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగతా నగరాల్లో నాలుగు నెలలకు మించి డిపాజిట్ తీసుకోరని, బెంగళూరులో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు నెటజన్లు మాత్రం ఇంటి యజమానికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

Crime news: పుట్టిన రోజు వేడుకలకు ఉపాధ్యాయుడిని ఆహ్వానించిన యువతి.. గదిలో ఏకాంతంగా ఉండగా.. సడన్‌గా మరో వ్యక్తి లోపలికి వచ్చి..

Updated Date - 2023-04-28T20:00:16+05:30 IST