Viral News: ఏం ఐడియా గురూ.. ఒకే ఒక్క రూపాయి తీసుకుంటాడట.. జాబ్ పక్కాగా ఇప్పిస్తాడట..!

ABN , First Publish Date - 2023-04-29T16:37:22+05:30 IST

దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో చాలా మంది నేరస్థులు దీన్ని అవకాశంగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. లక్షల జీతం అంటూ ఆశ చూపి.. చివరకు నిరుద్యోగులను నిండా ముంచేస్తున్నారు. ఇంకొందరు..

Viral News: ఏం ఐడియా గురూ.. ఒకే ఒక్క రూపాయి తీసుకుంటాడట.. జాబ్ పక్కాగా ఇప్పిస్తాడట..!

దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో చాలా మంది నేరస్థులు దీన్ని అవకాశంగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. లక్షల జీతం అంటూ ఆశ చూపి.. చివరకు నిరుద్యోగులను నిండా ముంచేస్తున్నారు. ఇంకొందరు ఉద్యోగాలు ఇప్పించినా.. అందుకు ప్రతిఫలంగా భారీ కమీషన్లు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో నిరుద్యోగుల సహాయార్థం ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఒక్క రూపాయి తీసుకుని జాబ్ ఇప్పిస్తామని చెబుతున్న ఇతన్ని చూసి.. అంతా ‘‘ ఏం ఐడియా గురూ’’.. అంటూ అభినందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...

ముంబైలోని (Mumbai) మురికివాడల్లో నివసించే ఉదయ్ పవార్.. నిరుద్యోగుల సహాయార్థం వినూత్నం నిర్ణయం తీసుకున్నాడు. ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ (slum) అయిన ధారవిలోని నిరుద్యోగులకు తన వంతు సాయంగా ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. టింగ్ టాంగ్ అనే యాప్‌ను (Ting Tong app) అభివృద్ధి చేసిన ఉదయ్.. అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ప్లంబర్ జాబ్ మొదలుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల వరకూ దేన్నైనా సులభంగా పొందే అవకాశాన్ని కల్పించాడు. రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365ల చెల్లించి అర్హతను బట్టి ఉద్యోగం పొందవచ్చని ఉదయ్ చెబుతున్నాడు.

Viral Video: బల్లి కరిస్తే ఏమవుతుంది..? ఈ కుర్రాడి చెవికి చివరకు ఏమైంది..?

ఉద్యోగాలు ఇప్పించినందుకు గానూ చాలా యాప్స్ భారీగా కమీషన్లు తీసుకుంటాయిని, దీనివల్ల నిరుద్యోగులు (unemployed) ఇబ్బందులు పడుతున్నారని ఉదయ్ చెప్పాడు. అందుకే తాను ఇలాంటి యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించాడు. తమ యాప్‌లో క్లినిక్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, లాయర్, సీఏ తదితర ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఉంటుందని తెలిపాడు. రూపాయికే ఉద్యోగం (job for one rupee) ఇప్పించాలనే ఈ యువకుడి ఈ నిర్ణయం.. ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. యువకుడిని అభినందింస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral news: చదువుకున్న బ్యాచ్‌లర్స్ కదా అని ఇల్లు అద్దెకిస్తే.. ఎంత పని చేశారో చూడండంటూ ఫొటోలను బయటపెట్టిన యజమాని..

Updated Date - 2023-04-29T16:37:22+05:30 IST