Crime News: రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఓ యువతి.. అత్యాచారం అనుకున్నారు కానీ మెలకువ వచ్చాక ఆమె చెప్పింది విన్న పోలీసులకు..

ABN , First Publish Date - 2023-04-29T21:59:28+05:30 IST

ప్రేమ పెళ్లిళ్ల విషయంలో యువకులకు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకుంటే ప్రేమకుడి నుంచి, ప్రేమికుడితో వెళ్లిపోతే తల్లిదండ్రుల నుంచి చిత్రహింసలు మొదలవుతుంటాయి. తాజాగా..

Crime News: రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఓ యువతి.. అత్యాచారం అనుకున్నారు కానీ మెలకువ వచ్చాక ఆమె చెప్పింది విన్న పోలీసులకు..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ పెళ్లిళ్ల విషయంలో యువకులకు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకుంటే ప్రేమకుడి నుంచి, ప్రేమికుడితో వెళ్లిపోతే తల్లిదండ్రుల నుంచి చిత్రహింసలు మొదలవుతుంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ యువతి రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో ఎవరైనా ఆమెను అత్యాచారం చేశారేమో అని పోలీసులు అనుమానించారు. అయితే మెలకువ వచ్చాక ఆమె చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బరేలీలోని ఫతేగంజ్ వెస్ట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి.. భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కూతురికి ఏప్రిల్ 22న ఘనంగా వివాహం చేశాడు. అయితే వివాహానికి ముందు ఆమె వేరే యువకుడిని ప్రేమించింది. అతన్నే పెళ్లి (marriage) చేసుకోవాలని అనుకుంది. కానీ కూతురు ప్రేమ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించారు. తర్వాత వేరే సంబంధం చూసి బలవంతంగా వివాహం చేశారు. వివాహం అయినా కూతురు తన ప్రేమికుడిని మర్చిపోలేకపోవడం.. తండ్రికి నచ్చలేదు. ఎలాగైనా ప్రియుడి వద్దకు వెళ్లాలని కూతురు అనడంతో కోపం పెంచుకున్నాడు.

Viral News: ఏం ఐడియా గురూ.. ఒకే ఒక్క రూపాయి తీసుకుంటాడట.. జాబ్ పక్కాగా ఇప్పిస్తాడట..!

వివాహమైన మరుసటి రోజు యువతి తన అత్తగారింటికి వెళ్లింది. ఆమెతో పాటూ తల్లిదండ్రులు కూడా వెళ్లారు. కూతురు ఎక్కడ ప్రేమికుడి (boyfriend) వద్దకు వెళ్తుందో అని తండ్రి అక్కడే ఉన్నాడు. కూతురు ప్రవర్తన చూసి తండ్రి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏప్రిల్ 25న కూతురు ఇంటికి తీసుకెళ్తున్నా అని చెప్పి పిలుచుకుని వచ్చాడు. మార్గమధ్యలో తన బంధువుతో కలిసి కూతురిపై (Father assaults daughter) దాడి చేశారు. ఇంకోసారి ప్రేమికుడి మాట ఎత్తితే చంపేస్తామంటూ విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. కూతురిని అక్కడే పడేసి వారు వెళ్లిపోయారు.

Viral Video: బల్లి కరిస్తే ఏమవుతుంది..? ఈ కుర్రాడి చెవికి చివరకు ఏమైంది..?

స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యువతి ఒంటిపై దుస్తులు చిరిగి ఉండడంతో ఎవరైనా అత్యాచారం చేశారేమో అనుకున్నారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన యువతి (young woman) .. పోలీసులకు అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూతురు తన ప్రేమికుడితో కలిసి పారిపోయిందని, దీంతో బలవంతంగా పెళ్లి చేయాల్సి వచ్చిందని తండ్రి తెలియజేశాడు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Viral news: చదువుకున్న బ్యాచ్‌లర్స్ కదా అని ఇల్లు అద్దెకిస్తే.. ఎంత పని చేశారో చూడండంటూ ఫొటోలను బయటపెట్టిన యజమాని..

Updated Date - 2023-04-29T21:59:28+05:30 IST