20 ఏళ్ల తర్వాత అందిన సంతానం.. ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరి.. ఒకే ఒక్క ఘటనతో..

ABN , First Publish Date - 2023-05-03T21:46:25+05:30 IST

వివాహమైన అనంతరం సంతానం కావాలని భార్యాభర్తలు కోరుకుంటుంటారు. అయితే కొందరికి వెంటనే సంతానం కలిగితే.. మరికొందరికి చాలా ఆలస్యంగా సంతానం అందుతుంటుంది. ఇంకొందరికి మాత్రం ఏళ్లకు ఏళ్లు ఆలస్యం అవుతుంటుంది. ఈ క్రమంలో..

20 ఏళ్ల తర్వాత అందిన సంతానం.. ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరి.. ఒకే ఒక్క ఘటనతో..

వివాహమైన అనంతరం సంతానం కావాలని భార్యాభర్తలు కోరుకుంటుంటారు. అయితే కొందరికి వెంటనే సంతానం కలిగితే.. మరికొందరికి చాలా ఆలస్యంగా సంతానం అందుతుంటుంది. ఇంకొందరికి మాత్రం ఏళ్లకు ఏళ్లు ఆలస్యం అవుతుంటుంది. ఈ క్రమంలో గర్భధారణకు సంబంధించిన సమస్యలు ఉన్న వారు వైద్యులను సంప్రదించి, వివిధ రకాల ఆధునిక పద్ధతుల ద్వారా సంతానం పొందుతుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే దంపతులకు వివాహమైన 20 ఏళ్ల తర్వాత IVF టెక్నాలజీ సాయంతో సంతానం కలిగింది. అయితే ఒకే ఒక్క ఘటనతో ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరైంది. వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని (Haryana) ఫతేహాబాద్‌ పరిధి హుడా సెక్టార్‌లో బల్వాన్ సింగ్, వీణ చిందాద్‌ దంపతులు (couple) నివాసం ఉంటున్నారు. బల్వాన్ సింగ్ ఫతేహాబాద్‌లోని భోడియా ఖేడా ఐటీఐలో ఇనస్ట్రక్టర్‌గా పని చేస్తున్నాడు. వీణ చిందాద్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా (Government school teacher) పని చేస్తోంది. వీరికి ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులూ లేవు. అయితే ఈ దంపతులకు వివాహమై 20 ఏళ్లయినా సంతానం లేదు. సంతానం కావాలనే కల.. కలగానే మిగిలిపోవడంతో వీరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు.

Selfie with Train: హైదరాబాద్‌లో 5 ఏళ్ల క్రితం నాటి ఘటనకు సంబంధించిన వీడియో మళ్లీ వైరల్‌.. అసలు ఈ కుర్రాడికి ఏమైందంటే..!

ఈ క్రమంలో బల్వాన్ సింగ్ సంతానం కోసం IVF టెక్నాలజీని (IVF technology) ఆశ్రయించాడు. మొత్తానికి 20 ఏళ్ల తర్వాత ఈ దంపతుల ఫలించింది. వీణ చిందాద్ ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వీరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లేక లేక కలిగిన సంతానం కావడంతో బాబును కంటికి రెప్పలా చూసుకునేవారు. అయితే ఈ ఆనందం మూడు నెలలు గడవకుండానే ఆవిరవుందని ఆ దంపతులు ఊహించలేకపోయారు. వ్యాక్సినేషన్ కోసం బాబును ప్రతి నెలా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మూడో నెల కూడా కొడుకును ఎత్తుకుని హుడా సెక్టార్‌లోని పాలీ క్లినిక్‌కి వెళ్లారు.

Viral News: ఆపరేషన్ చేసుకున్నా కూడా గర్భవతిని ఎలా అయ్యానంటూ ఓ మహిళకు డౌట్.. జరిగింది తెలిసి న్యాయపోరాటం.. చివరకు..

అయితే అక్కడ ఇంజక్షన్ ఇచ్చిన పిల్లాడి నోటి నుంచి నురగ రావడం మొదలైంది. దీంతో తల్లిదండ్రులు కంగారుపడి ఫతేబాద్‌లోని సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాబు అప్పటికే చనిపోయినట్లు చెప్పడంతో దంపతులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం (Medical negligence) వల్లే తమ కొడుకు చనిపోయాడని బంధువులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: ప్రియురాలితో హోటల్లో ఉన్న భర్త.. విషయం తెలిసి సడన్ ఎంట్రీ ఇచ్చిన భార్య.. ఇద్దరినీ కూర్చోబెట్టి..

Updated Date - 2023-05-03T21:46:25+05:30 IST