Crime: ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రియుడిని పెళ్లి చేసుకున్న యువతి.. చివరకు ఈమె పరిస్థితి ఏమైందో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-09-13T21:10:50+05:30 IST

సినిమా రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న ఆమె కలలు.. కల్లలుగా మారిపోతాయని ఊహించలేకపోయింది. సవ్యంగా సాగుతున్న జీవితంలోకి సమస్యలను కొనితెచ్చుకుంది. ఇంట్లో వాళ్లకు తెలీకుండా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఆమె.. ఉన్నట్టుండి కనిపించకుండాపోయింది. దీంతో..

Crime: ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రియుడిని పెళ్లి చేసుకున్న యువతి.. చివరకు ఈమె పరిస్థితి ఏమైందో తెలిస్తే..!
ప్రతీకాత్మక చిత్రం

సినిమా రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న ఆమె కలలు.. కల్లలుగా మారిపోతాయని ఊహించలేకపోయింది. సవ్యంగా సాగుతున్న జీవితంలోకి సమస్యలను కొనితెచ్చుకుంది. ఇంట్లో వాళ్లకు తెలీకుండా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఆమె.. ఉన్నట్టుండి కనిపించకుండాపోయింది. దీంతో తమ కూతురు కనిపించలేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా చివరికి ఏం జరిగిందంటే..

ముంబైలోని (Mumbai) పాల్ఘర్‌లోని నైగావ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నేపాల్‌కు చెందిన నయన రామచంద్ర మహత్ (29) అనే యువతి (young woman) .. స్థానిక సన్‌టెక్ టవర్ ప్రాంతంలో ఒంటరిగా ఉంటోంది. ఈమె సినిమాల్లో హెయిర్ డ్రెస్సర్‌గా (Hair dresser) పని చేస్తుండేది. ఈమె సోదరి నలసోపరాలోని ఓస్వాల్ నగరంలో ఉంటుంది. ఈమె కూడా కూడా సినిమాల్లోనే పని చేస్తుంటుంది. ఇదిలావుండగా, నయనకు ఐదేళ్ల కిందట మనోహర్ రవిశంకర్ అనే 43ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మనోహర్‌కి అప్పటికే వివాహమైంది. అయితే ఈ విషయాన్ని నయన వద్ద దాచి పెట్టాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. చివరకు ప్రేమకు దారి తీసింది. తర్వాత ఇద్దరూ కలిసి సహజీవనం (Live in relationship) కూడా చేశారు. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే ఇటీవల మనోహర్‌కు వివాహమైన విషయం నయనకు తెలిసింది. ‘‘పెళ్లయిన విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు’’.. అంటూ మనోహర్‌తో గొడవకు దిగింది.

Kriti Verma: ఎవరీ కృతీ వర్మ..? రూ.264 కోట్ల స్కామ్‌లో తెరపైకి ఈమె పేరు.. జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా జాబ్‌కు గుడ్ బై చెప్పి..!

women-crime.jpg

ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. చివరకు నయన అతడిపై అత్యాచారం కేసు పెట్టింది. ఈ కేసు పెట్టినప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. తనపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాలంటూ మనోహర్.. తరచూ నయనపై ఒత్తిడి తెస్తుండేవాడు. అయినా ఆమె మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఎలాగైనా ఆమెను అంతమొందించాలని మనోహర్ కుట్రపన్నాడు. ఆగస్టు 9న ఒంటరిగా ఉన్న నయనపై దాడి చేశాడు. తర్వాత ఆమెను నీటి తొట్టెలో ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి.. ముంబై నుంచి గుజరాత్‌లోని వాపి ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో సూట్‌కేస్‌ను పడేసి, ఏమీ తెలీనట్లు మళ్లీ ఇంటికి వెళ్లిపోయాడు. తమ కూతరు కనిపించలేదంటూ నయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరకు ఘటన స్థలంలో మృతదేహం చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించడంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Indian Railway: బోగీని శుభ్రం చేస్తున్న రైల్వే కార్మికుడు.. చెత్తనంతా ఒక్కచోట చేర్చి.. దాన్ని ఏం చేశాడో చూస్తే..!

Updated Date - 2023-09-13T21:10:50+05:30 IST