Viral Video: స్నేహితుడే కదా అని స్కూటీ ఆపితే.. మాట్లాడాల్సిందే అంటూ యువతి వద్దకు వెళ్లి.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

ABN , First Publish Date - 2023-06-27T21:51:33+05:30 IST

కొందరు వ్యక్తులు.. యువతులు, మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వారి ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా తాము చెప్పినట్లే వినాలంటూ కండీషన్లు పెడుతుంటారు. తమ దారికి రాని వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో ఆఖరికి చంపడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి ...

Viral Video: స్నేహితుడే కదా అని స్కూటీ ఆపితే.. మాట్లాడాల్సిందే అంటూ యువతి వద్దకు వెళ్లి.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

కొందరు వ్యక్తులు.. యువతులు, మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వారి ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా తాము చెప్పినట్లే వినాలంటూ కండీషన్లు పెడుతుంటారు. తమ దారికి రాని వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో ఆఖరికి చంపడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. స్నేహితుడే కదా స్కూటీ ఆపితే.. మాట్లాడమంటూ యువతి పట్ల ఓ యువకుడు దారుణంగా ప్రవర్తించాడు.

మహారాష్ట్ర (Maharashtra Pune) పూణేలోని సదాశివపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పెరుగేట్ పోలీస్ చౌక్ సమీపంలో మంగళవారం ఉదయం 10గంటల ప్రాంతంలో 19 ఏళ్ల యువతి (young woman) తన స్నేహితుడితో కలిసి స్కూటీపై వెళ్తోంది. అయితే పెరుగేట్ వచ్చే సమయానికి అక్కడ మరో యువకుడు వీరి కోసం వేచి చూస్తూ ఉన్నాడు. స్కూటీ (Scooty) దగ్గరికి రాగానే తనతో మాట్లాడాలంటూ బండిని నిలిపేస్తాడు. అయితే అతడితో మాట్లాడేందుకు యువతి నిరాకరిస్తుంది. దీంతో యువకుడు ఎలాగైనా మాట్లాడాలంటూ అడ్డగిస్తాడు. స్కూటీ డ్రైవ్ చేస్తున్న యువకుడు.. అడ్డగించిన యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

Viral News: ఒకే స్కూటీపై ఏడుగురు పిల్లల్ని తీసుకెళ్లిన వ్యక్తికి బిగ్ షాకిచ్చిన పోలీసులు.. సరికొత్త సెక్షన్‌తో కేసు పెట్టి..!

దీంతో అతను తన వద్ద ఉన్న సంచి నుంచి కత్తి బయటికి తీసి, స్కూటీపై ఉన్న యువకుడిపై దాడి (Assault on young man) చేస్తాడు. అతడి నుంచి తప్పించుకుని దూరంగా పారిపోతాడు. అనంతరం యువతిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో యువతి అక్కడి నుంచి వేగంగా పారిపోతుంది. గమనించిన స్థానికులు పరుగెత్తుకుంటూ వెళ్లి యువకుడిని అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించారు. నిందితుడు ముల్షి ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ జాదవ్ అని తెలిసింది. నిందితుడిలో దాడిలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరు ముగ్గురూ స్నేహితులని విచారణలో తెలిసింది. కాగా, యువకుడి దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: దంపతులను దోచుకోవడానికి వచ్చిన దుండగులు.. భర్త జేబు చూసి షాక్.. చివరకు వారు చేసిన పని..

Updated Date - 2023-06-27T21:51:33+05:30 IST