Viral Video: కూతురికి ప్రియుడు ఉన్నాడని తెలిస్తే.. నూటికి 95 శాతం మంది తల్లులు ఇలాగే చేస్తారేమో..!

ABN , First Publish Date - 2023-06-27T18:04:38+05:30 IST

ఇటీవల ప్రేమ వ్యవహారాల విషయంలో యువతీయువకులు ఊహించని నిర్ణయాలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రుల మాటకు కట్టుబడి ప్రేమను త్యాగం చేసేవారు కొందరైతే.. మరికొందరు ప్రేమించిన వారి కోసం కుటుంబ సభ్యులను ఎదిరిస్తుంటారు. చాలా మంది తల్లిదండ్రులు.. తాము చెప్పిన వారినే పెళ్లి చేసుకోవాలంటూ...

Viral Video: కూతురికి ప్రియుడు ఉన్నాడని తెలిస్తే.. నూటికి 95 శాతం మంది తల్లులు ఇలాగే చేస్తారేమో..!

ఇటీవల ప్రేమ వ్యవహారాల విషయంలో యువతీయువకులు ఊహించని నిర్ణయాలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రుల మాటకు కట్టుబడి ప్రేమను త్యాగం చేసేవారు కొందరైతే.. మరికొందరు ప్రేమించిన వారి కోసం కుటుంబ సభ్యులను ఎదిరిస్తుంటారు. చాలా మంది తల్లిదండ్రులు.. తాము చెప్పిన వారినే పెళ్లి చేసుకోవాలంటూ పిల్లలకు కండీషన్ పెడుతుంటారు. ఈ క్రమంలో కొందరు కూతుళ్లపై దాడులు కూడా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంభందించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కూతురి ప్రేమ గురించి తెలుసుకున్న తల్లి ఆగ్రహానికి గురైంది. ఆమె నిర్వాకం చూసి.. కూతురికి ప్రియుడు ఉన్నాడని తెలిస్తే.. నూటికి 95 శాతం మంది తల్లులు ఇలాగే చేస్తారేమో..! అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) తల్లిదండ్రులకు తెలీకుండా యువకుడితో ప్రేమాయణం సాగించింది. ఇటీవల ఈ విషయం తెలియడంతో యువతి తల్లి తీవ్ర ఆగ్రహానికి గురైంది. కూతురిని బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లింది. అంతటితో ఆగకుండా కుటుంబ సభ్యుల ఎదుటే కూతురు జుట్టు పట్టుకుని (Mother assaults daughter) దాడి చేసింది. ‘‘వద్దమ్మా.. కొట్టొద్దు’’.. అని కూతురు వేడుకుంటున్నా వినకుండా కొడుతూనే ఉంది. తర్వాత కొడుకుతో కలిసి కూతురిని ఇంట్లోని మరో గదిలోకి బలవంతంగా లాక్కెళ్లారు.

Wife: మరదలి ఇంటి నుంచి రాగానే.. భార్యకు చికెన్ వండి పెట్టిన భర్త.. కాసేపటికి స్థానికులు వచ్చి చూడగా షాకింగ్ సీన్..

యువతి మొదటి నుంచీ ఏడుస్తూనే ఉంది. తల్లి మాత్రం కోపంతో ఊగిపోతూ.. ‘‘ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తావా’’.. అంటూ కొడుతూనే ఉంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఈ తల్లి కోపం చూస్తుంటే భయమేస్తోంది’’.. అని కొందరు, ‘‘కూతురికి ప్రియుడు ఉన్నాడని తెలిస్తే.. నూటికి 95 శాతం మంది తల్లులు ఇలాగే చేస్తారేమో..!’’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Crime News: స్నేహితుడి భార్యపై కన్నేసిన యువకుడు.. చివరకు ఇద్దరూ కలిసి మాస్టర్ ప్లాన్.. ఓ రోజు చెరువు గట్టు వద్ద..

Updated Date - 2023-06-27T18:04:38+05:30 IST