Accident: కలలో కూడా ఊహించని చావు అంటే ఇలాగే ఉంటుందేమో.. బైక్ ఉన్న వాళ్లంతా తప్పక చదవాల్సిన వార్త ఇది..!

ABN , First Publish Date - 2023-06-27T19:49:39+05:30 IST

రోడ్డు నిబంధనలు పాటించాలని పోలీసులు పదే పదే సూచనలు చేస్తున్నా.. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొందరైతే మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. కొందరు యువకులు బైకులను అత్యంత వేగంగా నడుపుతూ ప్రమాదానికి గురైన సందర్భాలను..

Accident: కలలో కూడా ఊహించని చావు అంటే ఇలాగే ఉంటుందేమో.. బైక్ ఉన్న వాళ్లంతా తప్పక చదవాల్సిన వార్త ఇది..!

రోడ్డు నిబంధనలు పాటించాలని పోలీసులు పదే పదే సూచనలు చేస్తున్నా.. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొందరైతే మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. కొందరు యువకులు బైకులను అత్యంత వేగంగా నడుపుతూ ప్రమాదానికి గురైన సందర్భాలను గతంలో చాలా చూశాం. అయితే తాజాగా, రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం సంబంధించింది. కలలో కూడా ఊహించని చావు అంటే ఇలాగే ఉంటుందేమో.. అన్నట్లుగా ఈ ప్రమాదం జరిగింది. బైక్ ఉన్న వాళ్లంతా తప్పక చదవాల్సిన వార్త ఇది..

రాజస్థాన్‌ (Rajasthan) మాధోపూర్ జిల్లాలోని గంగాపూర్ సిటీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరౌలి జిల్లా భడ్క్యా ప్రాంతానికి చెందిన లోకేష్.. సోమవారం రాత్రి బైక్‌పై గంగాపూర్ సిటీ మీదుగా హిందౌన్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి వైపు వెళ్తున్నాడు. మరోవైపు కరౌలి ప్రాంతానికి చెందిన ఖుషీరామ్, మనురామ్‌ అనే యువకులు బైకు ఎదురుగా వస్తున్నారు. అయితే రాత్రి 12 గంటల ప్రాంతంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అత్యంత వేగంగా వస్తూ ఢీకొనడడంతో బైకులు (bikes) తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో లోకేష్ బైకు పెట్రోల్ ట్యాంక్ పేలిపోయింది. ఈ క్రమంలో పెట్రోల్ మొత్తం లోకేష్ దుస్తులపై పడింది. అదే సమయంలో మంటలు అంటుకోవడంతో (young man was burned alive) లోకేష్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు.

Viral Video: కూతురికి ప్రియుడు ఉన్నాడని తెలిస్తే.. నూటికి 95 శాతం మంది తల్లులు ఇలాగే చేస్తారేమో..!

మరో బైకులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్‌ ఆస్పత్రికి తరలించారు. గంగాపూర్ సిటీ పోలీసులు మాట్లాడుతూ అతి వేగమే ప్రాణాలు తీసిందని, బైకులో వెళ్తున్న వ్యక్తి సజీవదహనం అవడం ఇదే తొలిసారి అని చెప్పారు. బైకర్లు ఇలాంటి తప్పులు చేయకుండా.. హెల్మెట్లు ధరించడంతో పాటూ అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వార్త (Viral news) .. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: దంపతులను దోచుకోవడానికి వచ్చిన దుండగులు.. భర్త జేబు చూసి షాక్.. చివరకు వారు చేసిన పని..

Updated Date - 2023-06-27T19:49:39+05:30 IST