Viral Video: బాత్ టబ్‌ నీటిలో పడవను ముంచగానే.. రక్తం చిమ్ముతూ బయటికి వచ్చిన ఆకారాన్ని చూస్తే..

ABN , First Publish Date - 2023-06-27T15:39:40+05:30 IST

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే వింతలు, విశేషాలకు సంబంధించిన ఘటనలు.. వీడియోల రూపంలో క్షణాల్లో ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు ఆనందాన్ని పంచితే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మరోవైపు ...

Viral Video: బాత్ టబ్‌ నీటిలో పడవను ముంచగానే.. రక్తం చిమ్ముతూ బయటికి వచ్చిన ఆకారాన్ని చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే వింతలు, విశేషాలకు సంబంధించిన ఘటనలు.. వీడియోల రూపంలో క్షణాల్లో ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు ఆనందాన్ని పంచితే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మరోవైపు కొన్ని వినూత్న ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బాత్ టబ్‌ నీటిలో పడవ బొమ్మను ముంచగానే.. రక్తం చిమ్ముతూ బయటికి వచ్చిన ఆకారాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో జాస్ బాత్ బాంబ్ ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బాత్ టబ్‌ నీటిలో విచిత్ర ప్రయోగం చేశాడు. ముందుగా ప్యాక్ చేయబడిన కవర్ నుంచి పడవ (boat toy) ఆకారంలో ఉన్న నీలి రంగు బొమ్మను బయటికి తీశాడు. దాన్ని కెమెరాలకు చూపించిన తర్వాత నీటిలో వేసేస్తాడు. నీటిలో మునిగిన పడవ బొమ్మ.. నురగలు కక్కుతూ నిదానంగా పైకి తేలుతుంది. నీటిలో తేలుతున్న పడవను పట్టుకుని అటూ ఇటూ తిప్పగా ఎర్రటి రంగు బయటికి వస్తుంది.

Wife: మరదలి ఇంటి నుంచి రాగానే.. భార్యకు చికెన్ వండి పెట్టిన భర్త.. కాసేపటికి స్థానికులు వచ్చి చూడగా షాకింగ్ సీన్..

చివరగా చూస్తే.. నోరు తెరచిన షార్క్ తల (Shark head) మనకి కనిపిస్తుంది. పడవను నీటిలో ముంచితే షార్క్ తల పైకి రావడం చూస్తే.. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ వీడియో చిన్న పిల్లలను తెగ ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘స్నానం చేస్తున్నప్పుడు నిజంగా షార్క్ వస్తే ఏంటి పరిస్థితి’’.. అని కొందరు, ‘‘దీన్ని చూసిన తర్వాత టబ్ స్నానం అంటేనే భయమేస్తోంది’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నడి రోడ్డుపై ఇంత జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదు.. చివరకు ఈ యువతిని ఏం చేశాడో చూడండి..

Updated Date - 2023-06-27T15:39:40+05:30 IST