బాబోయ్ ఇవేం దారుణాలు.. చైనాలో పురుగుల వర్షమే కాదు.. ఇలాంటి భయంకరమైన వర్షాలు కూడా..

ABN , First Publish Date - 2023-03-13T14:02:41+05:30 IST

చైనాలో పురుగుల వర్షమే కాదండోయ్ ఇలాంటి సంఘటనలు మరికొన్ని ప్రపంచవ్యాప్తంగా..

బాబోయ్ ఇవేం దారుణాలు.. చైనాలో పురుగుల వర్షమే కాదు.. ఇలాంటి భయంకరమైన వర్షాలు కూడా..

చైనాలో పురుగుల వర్షం చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఏమిటీ వైపరీత్యమంటూ భయాందోళనలోకి జారుకుంది. అయితే చైనాలో పురుగుల వర్షమే కాదండోయ్ ఇలాంటి సంఘటనలు కొన్ని ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. రక్తం నుండి కరెన్సీ నోట్లు కూడా గుట్టలు గుట్టలుగా పడ్డాయి. ఇలాంటి సంఘటనల గురించి వివరంగా మేం చెబుతాం.. తెలుసుకోండి..

2004సంవత్సరంలో ఆస్ట్రేలియా(Australia) దేశంలో అనేక నగరాలలో ఆకాశం నుండి చేపల వర్షం కురిసింది. సముద్రంలో సంభవించిన భయంకరమైన తుఫాను ఫలితంగా ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. సముద్రంలో చోటుచేసుకున్న తుఫాను వల్ల సముద్రపు చేపలు సుడిగాలిలో ఇరుక్కుని ఆకాశంలోకి ఎగిరి ఉంటాయని, అవే ఇలా వివిధ నగరాల్లో చేపల వర్షంలా కురిశాయని చెప్పారు.

2007 సంవత్సరంలో ఆకాశం నుండి వేల సంఖ్యలో సాలెపురుగులు కురిశాయి. అర్జెంటీనా(Argentina) దేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఏదో తుఫాను ప్రభావం వల్ల అలా జరిగిందని శాస్త్రవేత్తలు కప్పిపుచ్చినా అన్ని సాలెపురుగులు ఎక్కడినుండి వచ్చాయని అక్కడివారు సందిగ్దంలో పడ్డారు. శాస్త్రవేత్తలు కూడా అన్ని సాలెపురుగులు ఎక్కడినుంచి వచ్చాయనే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.

కరెన్సీ వర్షంలా కురిసిన సంఘటన కూడా ఈ వింతల్లో ఉంది. 2007సంవత్సరంలో జర్మనీ(Germany) దేశంలో నోట్లవర్షం కురిసింది. ఒకచోట కారుడ్రైవర్ తన కారు నుండి దిగి ఆకాశం నుండి వర్షంలా కురుస్తున్న నోట్లను చూసి వాటిని ఏరుకుంటున్నాడు. దీని గురించి సమాచారం ఎలా తెలిసిందో కానీ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ నోట్లన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లన్నీ ఎలా ఎక్కడినుండి పడిపోతున్నాయనే విషయంపై ఎలాంటి స్పష్టత రాలేదు.

2008సంవత్సరంలో కొలంబియా(Colombia)లోని సియర్రా(Ciarra)లో రక్తం వర్షం కురిసింది. ఈ వర్షపాతం సంభవించినప్పుడు దేశమంతా కలకలం రేగింది. ప్రపంచం ఉలిక్కిపడింది. యుగాంతానికి ఇది సూచన అని కొందరన్నారు. కొందరు ఆమ్లవర్షమని, యాసిడ్ వర్షమని అన్నారు. కానీ దీనిగురించి పరిశోధన చేసిన తరువాత శాస్త్రవేత్తలు దీనికి కారణమేంటనే స్పష్టత ఇవ్వలేకపోయారు.

2010 మార్చి నెలలో ఇంగ్లాండ్(England) లో ఒక విచిత్రం జరిగింది. వేలకొద్ది పక్షులు చనిపోయి విగతజీవులుగా ఆకాశం నుండి రాలిపడ్డాయి. ఈ సంఘటన జరిగినప్పుడు ఇంగ్లాండ్ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనల వెనుక కారణాలను కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు.

Read also: నేను అత్తారింటికి వెళ్ళనని కార్లోంచి దిగిపోయిన నవవధువు.. వరుడికి ఆ సమస్య ఉందని అర్థమవడం వల్లే..


Updated Date - 2023-03-13T14:02:41+05:30 IST