Viral Video: ఎలాగైనా పట్టుకోవాలని ఇంట్లోకి వెళ్లిన పోలీసు.. తప్పించుకునే క్రమంలో చివరకు దొంగ చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , First Publish Date - 2023-09-01T18:54:39+05:30 IST

దొంగలను పట్టుకునేందుకు పోలీసులు.. వారి నుంచి తప్పించుకునేందుకు దొంగలు చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఘటనలు కేవలం సినిమాల్లోనే సాధ్యం అని అనుకుంటాం గానీ.. కొన్నిసార్లు ఇంతకంటే ఆశ్చర్యకర ఘటనలు నిజ జీవితంలోనూ...

Viral Video: ఎలాగైనా పట్టుకోవాలని ఇంట్లోకి వెళ్లిన పోలీసు.. తప్పించుకునే క్రమంలో చివరకు దొంగ చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..

దొంగలను పట్టుకునేందుకు పోలీసులు.. వారి నుంచి తప్పించుకునేందుకు దొంగలు చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఘటనలు కేవలం సినిమాల్లోనే సాధ్యం అని అనుకుంటాం గానీ.. కొన్నిసార్లు ఇంతకంటే ఆశ్చర్యకర ఘటనలు నిజ జీవితంలోనూ చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు దొంగ ఇంట్లోకి వెళ్లారు. వారి నుంచి తప్పించుకునేందుకు చివరకు దొంగ చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) దేవాస్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పలు గ్రామాలు, పట్టణాల్లో ఇటీవల మోటార్ సైకిళ్ల చోరీలు (motorcycles Theft) ఎక్కువయ్యాయి. దీంతో ఈ కేసులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. తరచూ ఒకే తరహాలో చోరీలు జరుగుతుండడంతో సీరియస్‌గా తీసుకున్నారు. చివరకు వివిధ కోణాల్లో విచారించి, కొందరు నేరస్థులంతా కలిసి ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారు ఉంటున్న ప్రాంతాన్ని (Police raids on thieves houses) గుర్తించిన పోలీసులు బృందాలుగా ఏర్పడి దాడులు చేశారు.

Triangle love story: ప్రేయసితో కలిసి కారులో షికారుకెళ్లిన ప్రియుడు.. మార్గ మధ్యలో డ్రైవర్‌ ఎవరో తెలుసుకుని తేరుకునేలోపే..

ఈ క్రమంలో ఖటేగావ్ ప్రాంతంలో ఉంటున్న పేరు మోసిన దొంగ అయిన అజయ్ అలియాస్ కాలు ఇంటికి వెళ్లారు. ఈ దొంగ పోలీసుల నుంచి తప్పించుకోవడంలో స్పెషలిస్ట్ అని తెలిసింది. అందులోనూ పెద్ద పెద్ద గోడలు సైతం అవలీలగా దూకేసి పారిపోవడంలో ఇతను నేర్పరి. దీంతో అతడి ఇంటిని పోలీసులు నలువైపుల నుంచీ చుట్టుముట్టారు. విషయం తెలుసుకున్న దొంగ.. ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో చివరికి ఇంట్లో మూలన ఉన్న (thief hiding in the cooler) కూలర్‌లో దాక్కున్నాడు. పోలీసులకు అనుమానం రాకుండా కూలర్ కూడా ఆన్ చేశాడు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు మొత్తం వెతికినా కనపడలేదు.

Viral Video: బాత్రూంల వద్ద యువతుల మధ్య విచిత్ర సమస్య.. చివరకు ఏం జరిగిందో చూస్తే అవాక్కవుతారు..

అయితే దొంగ తెలివితేటల గురించి ముందే తెలుసుకున్న పోలీసులు.. ఇంట్లో అనువణువూ గాలించారు. ఈ క్రమంలో కూలర్‌లో ఏదో ఉన్నట్లు అనుమానం వచ్చి చూడగా.. దొంగ బయటపడ్డాడు. ఇరుకుగా ఉండే స్థలంలో చాకచక్యంగా దాక్కున్న దొంగను చూసి పోలీసులు అవాక్కయ్యారు. చివరకు అతడికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో బయటికి వచ్చాడు. అజయ్‌పై ఇప్పటికే వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 25కు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇతడితో పాటూ మొత్తం 6మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, కూలర్‪‌లో దాక్కున్న దొంగ వీడియో (Viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..

Updated Date - 2023-09-01T18:57:11+05:30 IST