Viral Video: కూతురిని రైలు ఎక్కించిన తండ్రి.. తొందరపాటులో చేసిన తప్పు వల్ల... చివరకు ఏమైందో చూడండి..

ABN , First Publish Date - 2023-07-04T20:43:12+05:30 IST

బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొందరు తెగ హడావుడి పడుతుంటారు. ఎలాగైనా తాము అనుకున్న సమయానికి గమ్యస్థానం చేరాలనే తొందరలో సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలు కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంటాయి. రన్నింగ్ బస్సులు, రైళ్లు ఎక్కే సమయంలో...

Viral Video: కూతురిని రైలు ఎక్కించిన తండ్రి.. తొందరపాటులో చేసిన తప్పు వల్ల... చివరకు ఏమైందో చూడండి..

బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొందరు తెగ హడావుడి పడుతుంటారు. ఎలాగైనా తాము అనుకున్న సమయానికి గమ్యస్థానం చేరాలనే తొందరలో సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలు కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంటాయి. రన్నింగ్ బస్సులు, రైళ్లు ఎక్కే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కదులుతున్న రైల్లోకి తన కూతురిని ఎక్కించాడు. తర్వాత మరో కూతురితో కలిసి రైలు ఎక్కే సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్‌లోని (Rajasthan) అబూ రోడ్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అహోర్ తాలూకా బైసవాడకు చెందిన భీమారం అనే వ్యక్తి భార్య ఇద్దరు కూతుళ్లతో కలిసి ఫల్నా అనే ప్రాంతానికి వెళ్లేందుకు అబు రోడ్ రైల్వే స్టేషన్‌కి (Abu Road Railway Station) వెళ్లాడు. అయితే అప్పటికే సబర్మతి- జోధ్‌పూర్ రైలు (train) స్టేషన్ నుంచి బయలుదేరింది. దీంతో కంగారుపడిన భీమారం పరుగెత్తుకుంటూ వెళ్లి.. ముందుగా ఇద్దరు కూతుళ్లలో ఓ పాపను రైలు ఎక్కించాడు. తర్వాత మరో పాపను ఎత్తుకుని రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు.

Auto Drivers: ఐఫోన్‌ను పోగొట్టుకున్న ఓ యువతికి షాకింగ్ అనుభవం.. తనను దించేసిన ఆటో డ్రైవర్‌ను వెతుక్కుంటూ వెళ్తే..!

అయితే రైలు అప్పటికి మరింత వేగం అందుకోవడంతో ఎక్కేందుకు సాధ్యం కాలేదు. అయినా ఎలాగైనా ఎక్కాలనే తొందరలో బ్యాలెన్స్ తప్పి.. ప్లాట్‌ఫారమ్‌కు, రైలుకు మధ్యలో కూతురుతో సహా కిందకు పడిపోయాడు. కళ్ల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో భీమారం భార్య.. స్పృహ తప్పి పడిపోయింది. ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపారు. చివరకు అక్కడే ఉన్న రైల్వే పోలీసులు.. ప్రయాణికుల సాయంతో వారిద్దరినీ బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన తండ్రీకూతుళ్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC camera) రికార్డ్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: గుడికి దగ్గర్లో.. రోడ్డు పక్కన టీ షాపు నడుపుతున్న ఈ మహిళ.. ఆయనకు స్వయానా చెల్లెలు అని తెలిసి అవాక్కైన భక్తులు..!

Updated Date - 2023-07-04T20:43:12+05:30 IST