Auto Drivers: ఐఫోన్‌ను పోగొట్టుకున్న ఓ యువతికి షాకింగ్ అనుభవం.. తనను దించేసిన ఆటో డ్రైవర్‌ను వెతుక్కుంటూ వెళ్తే..!

ABN , First Publish Date - 2023-07-04T16:36:20+05:30 IST

ప్రయాణ సమయాల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చివరకు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇక మహిళలైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. పట్టపగలే మహిళలపై దాడులు చేయడం, మెడలోని చైన్లు లాక్కెళ్లే ఘటనలను రోజూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ..

Auto Drivers: ఐఫోన్‌ను పోగొట్టుకున్న ఓ యువతికి షాకింగ్ అనుభవం.. తనను దించేసిన ఆటో డ్రైవర్‌ను వెతుక్కుంటూ వెళ్తే..!
ప్రతీకాత్మక చిత్రం

ప్రయాణ సమయాల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చివరకు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇక మహిళలైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. పట్టపగలే మహిళలపై దాడులు చేయడం, మెడలోని చైన్లు లాక్కెళ్లే ఘటనలను రోజూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి నేరస్థులు ఉన్న ఈ సమాజంలో.. మంచితనం, నిజాయితీ ఇంకా మిగిలి ఉందని కొందరు రుజువు చేస్తూ ఉంటారు. తాజాగా, ముంబైలో ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది. ఐఫోన్‌ను పోగొట్టుకున్న యువతి.. తనను దించేసిన ఆటో డ్రైవర్‌ను వెతుక్కుంటూ వెళ్లింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో యువతికి సంబంధించిన వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. ముంబైకి (Mumbai) చెందిన ఓ యువతి (young woman) ఇటీవల వెర్సోవా మెట్రో స్టేషన్ (Metro station) వెళ్లేందుకు ఆటో ఎక్కింది. స్టేషన్ వద్ద దిగి నేరుగా స్టేషన్‌లోకి వెళ్లింది. ఎస్కలేటర్‌లో వెళ్తుండగా.. తన ఐ ఫోన్ (i phone) కోసం హ్యాండ్ బ్యాక్‌లో వెతికింది. అయితే అందులో ఫోన్ కనిపించకపోవడంతో షాక్ అయింది. ఆటో ఎక్కక ముందు ఉన్న ఫోన్ సడన్‌గా కనిపించకపోవడంతో షాక్ అయింది. వెంటనే స్టేషన్ బయటికి వెళ్లి.. తాను ఎక్కిన ఆటోను గాలిస్తూ వెళ్లింది. చివరకు ఆటోను గుర్తించి డ్రైవర్‌తో తన ఫోన్ గురించి చెప్పింది.

women clothes: ఆరబెట్టిన కాసేపటికి మాయమవుతున్న మహిళ దుస్తులు.. చివరకు సీసీ కెమెరా ఫుటేజీ చూడగా.. యువకుడు చేసిన నిర్వాకం..

సమస్య తెలుసుకున్న ఆటో డ్రైవర్ (Auto driver) వెంటనే స్పందించి.. తన సహచర డ్రైవర్లందరినీ అప్రమత్తం చేశాడు. ఎక్కడైనా ఐఫోన్ కనిపిస్తే ఇవ్వాలంటూ అందరికీ చెప్పడంతో పాటూ వెతికేందుకు ఆమెకు సహాయం చేశాడు. ఆటో డ్రైవర్లంతా ఫోన్ వెతకడంలో సాయం చేశారు. అయితే ఈ క్రమంలో రాహుల్ కుమార్ అనే (Food delivery boy) ఫుడ్ డెలివరీ బాయ్.. ఫోన్ తెచ్చి యువతికి అందజేశాడు. దీంతో తనకు ఫోన్ అందజేసిన యువకుడితో పాటూ ఆటో డ్రైవర్లందరికీ యువతి ధన్యవాదాలు తెలియజేసింది. కాగా, తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ.. యువతి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. పలు నెటిజన్లు ప్రయాణ సమయాల్లో తమకు ఎదురైనా ఇలాంటి అనుభవాలను వివరిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పెంపుడు కుక్క హెచ్చరిస్తున్నా వినిపించుకోని యువతి.. గిటార్ వాయిస్తుండగా ఉన్నట్టుండి..

Updated Date - 2023-07-04T16:36:20+05:30 IST