Viral Video: పెంపుడు కుక్క హెచ్చరిస్తున్నా వినిపించుకోని యువతి.. గిటార్ వాయిస్తుండగా ఉన్నట్టుండి..

ABN , First Publish Date - 2023-07-04T15:17:26+05:30 IST

కుక్కలు తమ యజమానుల క్షేమం కోరుకుంటాయి. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్ల ముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అందుకే చాలా మంది పెంపుడు కుక్కలను తమ పిల్లలతో సమానంగా పెంచుకుంటుంటారు. ప్రమాదాలను ముందే పసిగట్టి ...

Viral Video: పెంపుడు కుక్క హెచ్చరిస్తున్నా వినిపించుకోని యువతి.. గిటార్ వాయిస్తుండగా ఉన్నట్టుండి..

కుక్కలు తమ యజమానుల క్షేమం కోరుకుంటాయి. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్ల ముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అందుకే చాలా మంది పెంపుడు కుక్కలను తమ పిల్లలతో సమానంగా పెంచుకుంటుంటారు. ప్రమాదాలను ముందే పసిగట్టి యజమానులను హెచ్చరిస్తుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విష సర్పాలు, క్రూర జంతువులతో పోరాడిన కుక్కలను చాలా చూశాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి.. తన కుక్క పదే పదే హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా గిటార్ వాయిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ఇంట్లో కుర్చీలో కూర్చుని (young woman playing guitar) గిటార్ వాయిస్తుంటుంది. మంచి ట్యూన్ కోసం ప్రయత్నిస్తూ మధ్యలో అలసిపోయి, కొద్ది సేపు గిటార్ మీద తల వాల్చి రెస్ట్ తీసుకుంటుంది. తర్వాత మళ్లీ గిటార్ వాయిస్తూ ట్యూన్ ట్రై చేస్తూ ఉంటుంది. అయితే అప్పటికే ఓ గద్ద .. ఆ ఇంటి కిటీకీ బయట గమనిస్తూ ఉంటుంది. ఇంట్లో ప్లేట్‌లో ఉన్న ఆహార పదార్థాలను చూసి ఉన్నట్టుండి (hawk entered the house) లోపలికి వస్తుంది. ఆమె వెనుక వైపు దూరంగా ఉన్న టేబుల్‌పై వాలి తినేందుకు ఏమైనా ఉన్నాయా.. అని చూస్తూ ఉంటుంది. అయితే యువతి మాత్రం దాన్ని గమనించికుండా తన మానాన తాను గిటార్ వాయిస్తూ ఉంటుంది.

women clothes: ఆరబెట్టిన కాసేపటికి మాయమవుతున్న మహిళ దుస్తులు.. చివరకు సీసీ కెమెరా ఫుటేజీ చూడగా.. యువకుడు చేసిన నిర్వాకం..

ఆమె పెంపుడు కుక్క (dog) గద్దను గమనించి మొరుగుతూ యువతి వద్దకు వెళ్తుంది. కుక్క ఎందుకు అలా మొరుగుతుందో యువతికి అర్థం కాక.. సైలెంట్‌గా ఉండమంటూ వారించే ప్రయత్నం చేస్తుంది. అయినా కుక్క మాత్రం మొరుగుతూనే ఉంటుంది. ఇంతలో యువతి పక్కన ప్లేట్‌లోని ఆహార పదార్థాలను గమనించిన గద్ద.. ఎగురుకుంటూ వచ్చి ఆమె పక్కన వాలుతుంది. చప్పుడు విని పక్కకు తిరిగి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే పైకి లేచి ఇంట్లోకి పరుగులు పెడుతుంది. తర్వాత కుక్క టేబుల్ పైకి వెళ్లి.. గద్దను అక్కడి నుంచి తరిమికొడుతుంది. ఇంట్లో అటూ ఇటూ తిరిగిన గద్ద తర్వాత కిటికీ నుంచి బయటికి వెళ్లిపోతుంది. దీంతో ఆమె హమ్మయ్య!.. అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

woman: ప్రేమికుడిని అర్ధరాత్రి ఇంటికి పిలిచిన వివాహిత.. కాసేపటికి పొలంలో కనిపించడంతో.. ఓ వ్యక్తికి అనుమానం వచ్చి చూడగా..

Updated Date - 2023-07-04T15:17:26+05:30 IST