Weight Loss: ఈ యువతి వయసు 28 ఏళ్లు.. బరువు 95 కిలోలు.. పెళ్లికి ముందే బరువు తగ్గేందుకు ఈమె చేసిన ఒక్క మిస్టేక్‌తో..!

ABN , First Publish Date - 2023-06-01T12:36:49+05:30 IST

ఊబకాయం (Obesity).. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా అందిరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య.

Weight Loss: ఈ యువతి వయసు 28 ఏళ్లు.. బరువు 95 కిలోలు.. పెళ్లికి ముందే బరువు తగ్గేందుకు ఈమె చేసిన ఒక్క మిస్టేక్‌తో..!

ఇంటర్నెట్ డెస్క్: ఊబకాయం (Obesity).. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా అందిరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో స్థూలకాయంతో బాధపడుతున్న వ్యక్తులు శస్త్రచికిత్స ద్వారా కొవ్వును తొలగించే పనిలో పడుతున్నారు. దీనిని వైద్య పరిభాషలో బేరియాట్రిక్ సర్జరీ (Bariatric Surgery) అంటారు. దీని వల్ల పొట్ట పరిమాణం తగ్గుతుంది. అదే సమయంలో మీరు ఆహారం తక్కువగా తీసుకోవడం ప్రారంభిస్తారు. అంటే తక్కువగా తిన్న కూడా మీ కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుందన్నమాట. ఈ శస్త్రచికిత్స ద్వారా ఊబకాయంతో పాటు శరీర బరువు రెండూ తగ్గుతాయి.

ఇక చికిత్స సమయంలో శరీరం నుండి అదనపు కొవ్వు తొలగించబడుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, కొన్నిసార్లు ఈ శస్త్రచికిత్స ప్రాణాంతకంగా మారుతోంది. ఇండోర్‌లో తాజాగా ఇలాంటి ఓ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కావాల్సిన ఓ యువతి అర్థారంతరంగా ప్రాణాలు కోల్పోయింది. 95 కిలోల బరువు ఉన్న ఆ యువతి పెళ్లికి ముందే బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నం ఆమె ప్రాణాలు తీసింది. మృతురాలి పేరెంట్స్ బుధవారం కలెక్టర్ బహిరంగ కార్యక్రమంలో భాగంగా నర్సింగ్ హోమ్ వారు చేసిన తప్పిదం తమ కూతురి ప్రాణాలు తీసిందంటూ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Viral Video: ఈ ఆటోడ్రైవర్ తెలివి ముందు ఇంజనీర్లు కూడా సరిపోరుగా.. ఎండలు మండిపోతున్నాయని ప్రయాణీకుల కోసం..!


పూర్తి వివరాల్లోకి వెళ్తే... భోపాల్ (Bhopal) పరిధిలోని అశోక గార్డెన్‌ నివాసి దివ్య శర్మ (28). పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగిని. ఇటీవల ఆమెకు పెళ్లి ఫిక్సయింది. కానీ, ఆమె బరువు 98 కిలోలు. దాంతో పెళ్లికి ముందే బరువు తగ్గాలనుకుంది. దీనికోసం సోమవారం ఇండోర్‌లోని బెంగాళీ క్రాస్‌రోడ్స్‌లో ఉండే అర్పిత్ నర్సింగ్ హోంకు (Arpit Nursing Home) వెళ్లింది. అక్కడి వైద్యులు ఆమెకు శరీర బరువు తగ్గించేందుకు బేరియాట్రిక్ సర్జరీ మొదలెట్టారు. అయితే, ఆ డాక్టర్లు ఏం మిస్టేక్ చేశారో తెలియదు. సర్జరీ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే ఆమె చనిపోయింది.

మీ అమ్మాయికి కడుపునొప్పి వస్తోందట.. వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లండంటూ నీట్ కోచింగ్ సెంటర్ నుంచి ఫోన్.. డాక్టర్లు చెప్పింది విని..!

ఉదయం 11.30 గంటలకు ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లిన ఆమెను.. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులకు నర్సింగ్ హోంవారు ఫోన్ చేశారు. దాంతో వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ నర్సింగ్ హోంకు వెళ్లారు. అసలేం జరిగిందని అడిగితే.. వారు చెప్పిన సమాధానం.. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి.. గొడవ మాత్రం చేయొద్దని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారట. వారి తప్పులేకుంటే డబ్బు ఇస్తామని ఎందుకు అంటారంటూ దివ్య పేరెంట్స్.. బుధవారం కలెక్టర్ బహిరంగ కార్యక్రమంలో అర్పిత నర్సింగ్ హోంపై ఫిర్యాదు చేశారు. తన కూతురికి న్యాయం జరిగేలా సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..

Updated Date - 2023-06-01T12:45:04+05:30 IST