మీ అమ్మాయికి కడుపునొప్పి వస్తోందట.. వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లండంటూ నీట్ కోచింగ్ సెంటర్ నుంచి ఫోన్.. డాక్టర్లు చెప్పింది విని..!

ABN , First Publish Date - 2023-05-31T10:31:56+05:30 IST

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ 16 ఏళ్ల మైనర్ నీట్ (NEET) ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతోంది.

మీ అమ్మాయికి కడుపునొప్పి వస్తోందట.. వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లండంటూ నీట్ కోచింగ్ సెంటర్ నుంచి ఫోన్.. డాక్టర్లు చెప్పింది విని..!

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ 16 ఏళ్ల మైనర్ నీట్ (NEET) ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతోంది. కోచింగ్ నిమిత్తం కోటాకు వచ్చింది. రెండు నెలలుగా అక్కడి ఓ కోచింగ్ సెంటర్‌లో ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం (మే 29న) ఉన్నట్టుండి బాలికకు కడుపునొప్పి వచ్చింది. దాంతో కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఆమె పేరెంట్స్‌కు కబురు చేశారు. మీ అమ్మాయికి కడుపునొప్పి వస్తోంది.. వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లండంటూ ఫోన్ చేశారు. వారి సమాచారంతో వెంటనే కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన బాలిక పేరెంట్స్ ఆమెను జేకే లాన్ ఆస్పత్రికి (JK Lon Hospital) తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఆమెను పరీక్షించిన డాక్టర్లు చెప్పింది విని పేరెంట్స్ షాకయ్యారు. అసలు బాలికకు ఏమైంది? వైద్యులు చెప్పిన ఆ షాకింగ్ విషయం ఏంటి? తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నీట్ పరీక్ష కోసం కోచింగ్ తీసుకునేందుకు కున్‌హాడి ప్రాంతంలో నివాసముండే 16 ఏళ్ల అమ్మాయి సమీపంలోని కోటాకు వచ్చింది. అక్కడి ఓ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయింది. రెండు నెలలుగా ఆ కోచింగ్ సెంటర్‌లోనే ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం ఉన్నట్టుండి ఆమెకు కడుపునొప్పి వచ్చింది. బాధతో విలవిలాడిపోయింది. అది గమించిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వెంటనే ఆమె పేరెంట్స్ సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అమ్మాయిని సమీపంలోని జేకే లాన్ హాస్పిటల్‌కు తరలించారు. ఇక ఆమెను పరీక్షించిన వైద్యులు పేరెంట్స్‌తో షాకింగ్ విషయం చెప్పారు. మీ అమ్మాయి ఎనిమిదిన్నర నెలల గర్భిణీ అని, ప్రస్తుతం పురిటినొప్పులతో బాధ పడుతున్నట్లు తెలిపారు. ఆ మాటలు విన్న పేరెంట్స్ గుండె ఆగినంత పనయింది. ఏదైతైనేమీ మొదట డెలివరీ చేయండంటూ వైద్యులకు చెప్పారు. దాంతో వెంటనే ఆమెను డెలివరీ వార్డుకు తరలించారు.

Crime: ఈ డౌట్ ముందే వచ్చి ఉంటే రూ.4.50 లక్షలు మిగిలేవి కదమ్మా.. 37 ఏళ్ల బెంగళూరు మహిళకు షాకింగ్ అనుభవం..!


కొద్దిసేపటి తర్వాత అమ్మాయి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక మైనర్ బాలిక.. బిడ్డకు జన్మనివ్వడం గురించి తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం వెంటనే ఆస్పత్రికి చేరుకుంది. బాలికను నుంచి సమాచారం రాబట్టాలని చూసింది. కానీ, ఆమె స్పృహలో లేకపోవడంతో వెనుదిరిగింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అటు పోలీసులు కూడా బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె ఇచ్చే సమాచారం మేరకు కేసు నమోదు చేయాలని చూస్తున్నారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. అసలు బాలిక ఎవరి వల్ల గర్భం దాల్చిందనే విషయం తెలియాల్సి ఉంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇంకా షాక్‌లోనే ఉన్నారు.

Delhi Sakshi Murder Case: ఢిల్లీలో 16 ఏళ్ల ప్రేయసి హత్య కేసులో షాకింగ్ నిజాలు బయటపెట్టిన సాహిల్.. అందుకే చంపేశానంటూ..

Updated Date - 2023-05-31T10:36:40+05:30 IST