Delhi Sakshi Murder Case: ఢిల్లీలో 16 ఏళ్ల ప్రేయసి హత్య కేసులో షాకింగ్ నిజాలు బయటపెట్టిన సాహిల్.. అందుకే చంపేశానంటూ..

ABN , First Publish Date - 2023-05-30T12:07:14+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఆదివారం రాత్రి 16 ఏళ్ల బాలికను ఆమె ప్రియుడు అతి కిరాతకంగా కత్తితో పొడిచి, ఆ తర్వాత బండరాయితో కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

Delhi Sakshi Murder Case: ఢిల్లీలో 16 ఏళ్ల ప్రేయసి హత్య కేసులో షాకింగ్ నిజాలు బయటపెట్టిన సాహిల్.. అందుకే చంపేశానంటూ..

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఆదివారం రాత్రి 16 ఏళ్ల బాలికను ఆమె ప్రియుడు అతి కిరాతకంగా కత్తితో పొడిచి, ఆ తర్వాత బండరాయితో కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన తాలూకు వీడియో సోమవారం బయటకు వచ్చింది. ఓ కిరాతకుడిలా సదరు యువకుడు బాలికపై దాడి చేయడం వీడియోలో రికార్డైంది. ఇదిలాఉంటే.. సోమవారం హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరించిన అతడు.. విచారణలో షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. ప్రేయసిని అంత దారుణంగా ఎందుకు చంపాడో పోలీసులకు తెలిపాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో జనాలతో ఎల్లప్పుడు రద్దీగా ఉండే షాబాద్‌ డెయిరీ ప్రాంతంలోని ఓ వీధిలో ఆదివారం రాత్రి జరిగిందీ ఘోరం! హతురాలు 16 ఏళ్ల బాలిక సాక్షి. ఇంతటి ఉన్మాదానికి తెగించింది ఆమె ప్రియుడు, 20 ఏళ్ల సాహిల్‌ అనే యువకుడు. షాబాద్‌ డెయిరీ ప్రాంతానికి చెందిన సాహిల్‌.. జేజే కాలనీకి చెందిన సాక్షి గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఇద్దరూ గొడవ పడ్డారు. దీన్ని మనసులో పెట్టుకున్న సాహిల్‌ ఎలాగైనా సాక్షిని అంతమొందించాలని అనుకున్నాడు.

Viral News: భర్తకు విడాకులిచ్చి రెండేళ్లయింది.. యువతితో సహజీవనం చేస్తూ తల్లైన మహిళ.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!

తన స్నేహితురాలి ఇంట్లో జరిగే వేడుక కోసం షాపింగ్‌ చేసేందుకు సాక్షి ఆదివారం రాత్రి ఒంటరిగా బయటకు వచ్చింది. అప్పటికే సాహిల్ ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. సాక్షి బయటకు రావడంతో దారి కాచి అడ్డుకున్నాడు. వెంట తెచ్చుకున్న కత్తితో సాక్షిని విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర గాయాలతో రక్తసిక్తమై ఆ బాధను తట్టుకోలేక ఆమె ఏడుస్తున్నా కనికరించలేదు సరికదా.. పోటు మీద పోటు.. ముప్పై నాలుగు సార్లు పొడిచాడు. దాంతో బాధితురాలు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అప్పటికీ అతడి కసి చల్లారక ఓ పెద్ద బండరాయి తీసి ఆమె ముఖంపై వేశాడు. అలా నాలుగైదుసార్లు వేసి.. అప్పటికే తూట్లు తూట్లు పడ్డ మృతదేహాన్ని మరింత ఛిద్రం చేశాడు. పలుమార్లు ఆ మృతదేహాన్ని కాలితో కూడా తన్నాడు. సాక్షి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఓ బస్సు ఎక్కి బులంద్‌షహర్ వెళ్లిపోయాడు.

Housewife: వామ్మో.. ఇలాంటి భార్యలు ఉన్న భర్తలకు ఎన్ని కోట్ల ఆస్తి ఉండాలో.. ఒక్క రోజులో రూ.73 లక్షలు షాపింగ్ చేసిందట..!


ఇక సమాచారం అందుకున్న పోలీసులు అతడి కోసం వేటా ప్రారంభించారు. సోమవారం సాహిల్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరించిన అతడు.. సాక్షిని ఎందుకు హత్య చేశాడో వివరించాడు. "నేను ప్రాణంగా ప్రేమించిన సాక్షి.. కొన్నిరోజుల నుంచి నన్ను దూరం పెడుతోంది. బ్రేకప్ చెప్పాలని నిర్ణయించుకుంది. ఎంత బతిమాలిన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దాంతో ఆమెపై కోపం కలిగింది. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాను" అని పోలీసులతో చెప్పాడు. తనను దూరం పెట్టినందుకే ఆమెను చంపేశానని, అందుకు తనకు ఎలాంటి బాధ లేదని తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. సాహిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

Viral Video: సెలవుల తర్వాత ఆఫీసుకు తిరిగొచ్చిన మేనేజర్‌.. టేబుల్‌లో ఫైళ్ల కోసం వెతుకుతోంటే లోపల కనిపించిన సీన్ చూసి..!

Updated Date - 2023-05-30T12:09:07+05:30 IST