Housewife: వామ్మో.. ఇలాంటి భార్యలు ఉన్న భర్తలకు ఎన్ని కోట్ల ఆస్తి ఉండాలో.. ఒక్క రోజులో రూ.73 లక్షలు షాపింగ్ చేసిందట..!

ABN , First Publish Date - 2023-05-28T10:43:50+05:30 IST

ఇక్కడ మనం చెప్పుకోబోయే ఓ ఇల్లాలి షాపింగ్ గురించి తెలిస్తే మీరు షాక్ కావడం ఖాయం. ఆ తర్వాత ఇలాంటి భార్యలు ఉన్న భర్తలకు ఎన్ని కోట్ల ఆస్తి ఉండాలో అని అంటారు కూడా.

Housewife: వామ్మో.. ఇలాంటి భార్యలు ఉన్న భర్తలకు ఎన్ని కోట్ల ఆస్తి ఉండాలో.. ఒక్క రోజులో రూ.73 లక్షలు షాపింగ్ చేసిందట..!

ఇంటర్నెట్ డెస్క్: 'భార్యతో షాపింగ్ వెళ్లడం కంటే బుద్ది తక్కువ పని మరోకటి ఉండదరు బాబు. పైసలను నీళ్లలా ఖర్చు చేసేస్తుంది. అరే.. అవసరమున్న.. లేకున్న కనిపించిందల్లా కొనేస్తుంది' ఇది చాలామంది భర్తలు తమ స్నేహితుల వద్ద చెప్పుకునే మాటలు. అయితే, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఓ ఇల్లాలి షాపింగ్ గురించి తెలిస్తే మీరు షాక్ కావడం ఖాయం. ఆ తర్వాత ఇలాంటి భార్యలు ఉన్న భర్తలకు ఎన్ని కోట్ల ఆస్తి ఉండాలో అని అంటారు కూడా. ఇంతకీ ఆమె ఒక్క రోజులోనే షాపింగ్‌కు ఎంత ఖర్చు చేసింది? ఆమె భర్త ఏం చేస్తారు? అసలు ఈ దంపతులు ఎక్కడ ఉంటారు? తదితర వివరాలు తెలుసుకుందాం.

ఆమె పేరు సౌదీయా (Soudia). దుబాయ్‌లో ఉంటోంది. సౌదీయాకు ఆరేళ్ల వయసు వరకు వారి ఫ్యామిలీ ససెక్స్‌ (Sussex)లో నివాసం ఉండేది. ఆ తర్వాత దుబాయ్‌కి వచ్చి స్థిరపడ్డారు. ఆమె భర్త జమాల్ (Jamal) ఎమిరేట్ పౌరుడు. వారిద్దరూ దుబాయ్ యూనివర్సిటీలో తొలిసారి కలిశారట. అలా ఏర్పడిన పరిచయం ఆ తర్వాత అతి తక్కవ కాలంలోనే ప్రేమగా మారింది. రెండేళ్ల తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు. జమాల్ మంచి ఆస్తిపరుడు కావడంతో సౌదీయాకు ఎలాంటి లోటు లేకుండా పోయింది. వివాహమైనప్పటి (Marriage) నుంచి దంపతులిద్దరూ ప్రతిరోజూ ఆనందంగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా తన లగ్జరీయస్ లైఫ్ (Luxurious life) గురించి ఆమె సోషల్ మీడియా ద్వారా తన స్నేహితులతో పంచుకుంది.

Viral Video: సెలవుల తర్వాత ఆఫీసుకు తిరిగొచ్చిన మేనేజర్‌.. టేబుల్‌లో ఫైళ్ల కోసం వెతుకుతోంటే లోపల కనిపించిన సీన్ చూసి..!


"నా భర్త జమాల్ మూడ్‌ను బట్టి రోజుకు మేము సాధారణంగా రూ. 3.66లక్షల నుంచి రూ.73లక్షల వరకు షాపింగ్ చేస్తుంటాం. నా ఫేవరెట్ డిజైనర్ డియోర్, జమాల్‌ మాత్రం హెర్మెస్ డిజైనింగ్‌ను ఇష్టపడతాడు. మా ఇద్దరికీ మాల్దీవులంటే చాలా ఇష్టం. ఇక లండన్‌కైతే తరచూ వెళ్తుంటాం. ఇటీవలే షీసెల్స్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చాం. తర్వాతి టూర్ జపాన్. ఇక జమాల్ అయితే ప్రతిసారి ఏదో ఒక కాస్ట్లీ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేస్తుంటాడు. ప్రతిరాత్రి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తోనే వస్తుంటాడు. ఇటీవలే రెండు ఖరీదైన కార్లు కొనిచ్చాడు. మా ఇద్దరికీ మ్యాచింగ్ కార్లు ఉన్నాయి. ఇక బయట రెస్టారెంట్‌కు వెళ్తే తక్కువలో తక్కువ రూ. 1.10లక్షలు ఖర్చు అవుతుంటాయి" అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక చివరగా 'నేను రిచ్ దుబాయ్ హౌజ్‌వైఫ్‌ను, భర్త సంపాదనను ఖర్చు పెట్టడమే నా హాబీ' అని తెలిపింది. సౌదీయా చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Wonderful Trick: ఈ యువతి టెక్నిక్ అదుర్స్.. అంత లావున్న మహిళ కాస్తా ఒక్క ట్రిక్‌తో ఎంత సన్నగా కనిపిస్తోందో మీరే చూడండి..!

Updated Date - 2023-05-28T10:47:30+05:30 IST