Crime: ఈ డౌట్ ముందే వచ్చి ఉంటే రూ.4.50 లక్షలు మిగిలేవి కదమ్మా.. 37 ఏళ్ల బెంగళూరు మహిళకు షాకింగ్ అనుభవం..!

ABN , First Publish Date - 2023-05-30T13:55:05+05:30 IST

కర్నాటక రాజధాని బెంగళూరుకు (Bengaluru) చెందిన 37 ఏళ్ల ఓ మహిళకు తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది.

Crime: ఈ డౌట్ ముందే వచ్చి ఉంటే రూ.4.50 లక్షలు మిగిలేవి కదమ్మా.. 37 ఏళ్ల బెంగళూరు మహిళకు షాకింగ్ అనుభవం..!

ఇంటర్నెట్ డెస్క్: కర్నాటక రాజధాని బెంగళూరుకు (Bengaluru) చెందిన 37 ఏళ్ల ఓ మహిళకు తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది. ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా నాలుగున్నర లక్షలు పొగొట్టుకుంది. ఆన్‌లైన్ పరిచయం కాస్తా ఆమెను ఇలా నట్టేట ముంచేసింది. చివరికి చేసేదేమిలేక పోలీసులను ఆశ్రయించింది. అసలేం జరిగిందంటే.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే 37ఏళ్ల మహిళకు డేటింగ్ యాప్ 'టిండర్' (Tinder) ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన పేరు అద్వైక్ చోప్రా అని, తాను లండన్‌లో డాక్టర్ ప్రాక్టీస్‌లో ఉన్నానని ఆమెను పరిచయడం చేసుకున్నాడు. దాంతో ఆమె ఆ వ్యక్తితో తరచూ చాటింగ్, మాట్లాడటం చేసేది.

అలా ఏర్పడిన ఆ పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది. అంతే.. అతడిని ఆమె గుడ్డిగా నమ్మడం మొదలెట్టింది. ఇక ఒకరోజు చోప్రా ఆమెను చూడటానికి నేరుగా బెంగళూరు వస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో మే 17వ తేదీన ఆమెకు గుర్తు తెలియని ఒక నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. తాను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (Airport Authority of India) నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పాడు. లండన్ నుంచి భారత్‌‌కు వచ్చిన చోప్రా కొంత నగదుతో ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డాడని, వాటిని తాము స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాడు. ఆ నగదుతో పాటు చోప్రాను విడిచిపెట్టేందుకు ఫీజు కింద రూ. 4.54లక్షలు పంపించాలని చెప్పాడు. ఇక అది నిజమని నమ్మిన ఆమె.. వెంటనే అవతి వ్యక్తి చెప్పిన బ్యాంక్ ఖాతాకు నాలుగున్నర లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసేసింది.

Delhi Sakshi Murder Case: ఢిల్లీలో 16 ఏళ్ల ప్రేయసి హత్య కేసులో షాకింగ్ నిజాలు బయటపెట్టిన సాహిల్.. అందుకే చంపేశానంటూ..

ఆ తర్వాత కొద్దిసేపటికి అదే వ్యక్తి మళ్లీ ఫోన్ చేసి మరో రూ.6లక్షలు పంపాలంటూ ఏవో కారణాలు చెప్పాడు. దాంతో ఆమెకు అనుమానం కలిగింది. దాంతో అవతలి వ్యక్తిని ప్రశ్నించింది. అంతే.. ఒక్కసారిగా ఫోన్‌కాల్ కట్ అయిపోయింది. అటు అద్వైక్ చోప్రా కూడా వెంటనే టిండర్ నుంచి తన ప్రొఫైల్‌ను తొలిగించేశాడు. అప్పుడుగానీ ఆమెకు తాను మోసపోయాననే విషయం బోధపడలేదు. దాంతో చేసేదేమిలేక తనకు జరిగిన ఆన్‌లైన్ మోసం విషయమై బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Housewife: వామ్మో.. ఇలాంటి భార్యలు ఉన్న భర్తలకు ఎన్ని కోట్ల ఆస్తి ఉండాలో.. ఒక్క రోజులో రూ.73 లక్షలు షాపింగ్ చేసిందట..!

Updated Date - 2023-05-30T13:57:49+05:30 IST