Viral Video: వారెవ్వా.. ఈ బుడ్డోడి తెలివి మామూలుగా లేదుగా.. వీడు లెక్కల్లో కింగ్ కావడం ఖాయం.. కాలికి సాక్సులు ఉన్నా..!

ABN , First Publish Date - 2023-05-30T12:49:36+05:30 IST

చిన్న పిల్లలు ఏ పని చేసిన చాలా క్యూట్‌గా ఉంటది. వారు చేసే పనుల్లో కొంత అమాయకత్వం, ఇంకొంత ఇంటెలిజెన్స్ దాగుంటాయి.

Viral Video: వారెవ్వా.. ఈ బుడ్డోడి తెలివి మామూలుగా లేదుగా.. వీడు లెక్కల్లో కింగ్ కావడం ఖాయం.. కాలికి సాక్సులు ఉన్నా..!

Viral Video: చిన్న పిల్లలు ఏ పని చేసిన చాలా క్యూట్‌గా ఉంటది. వారు చేసే పనుల్లో కొంత అమాయకత్వం, ఇంకొంత ఇంటెలిజెన్స్ దాగుంటాయి. ఇదే కోవకు చెందిన ఓ బుడ్డోడి వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది (Video goes Viral). వీడియో చూసిన నెటిజన్లు.. ఈ బుడ్డోడి తెలివి మామూలుగా లేదుగా.. వీడు లెక్కల్లో కింగ్ కావడం ఖాయం అని కామెంట్ చేస్తున్నారు. ఇక వీడియో విషయానికి వస్తే.. ఓ బుడ్డోడు (Little Boy) స్కూల్‌లో ఉండడం మనం చూడొచ్చు. క్లాస్‌‌రూంలో టీచర్ లెక్కల పాఠాలు చెబుతుంటే.. బోర్డు మీద ప్రశ్నలకు మనోడు సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నాడు.

దానికోసం మనోడు ఎంచక్కా.. చేతి, కాలి వేళ్లను ఉపయోగించడం మనం వీడియోలో గమనించవచ్చు. కౌంటింగ్‌లో భాగంగా చేతి వేళ్లతో పాటు కాలి వేళ్లను లెక్కించడం.. సమధానం వచ్చిన వెంటనే పెన్నుతో పేపర్‌పై రాయడం వీడియోలో ఉంది. కాలికి సాక్సులు ఉన్నా.. దానిపై నుంచే ఆ బుడతడు కౌంటింగ్ చేస్తూ కనిపించాడు. 'రైజింగ్ టాలెంట్' అనే ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఈ వీడియో పోస్టయింది. వీడియో పాతదే అయినా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 3.84లక్షల లైక్స్ రావడం విశేషం. ఇక వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Delhi Sakshi Murder Case: ఢిల్లీలో 16 ఏళ్ల ప్రేయసి హత్య కేసులో షాకింగ్ నిజాలు బయటపెట్టిన సాహిల్.. అందుకే చంపేశానంటూ..


Updated Date - 2023-05-30T12:49:36+05:30 IST