Viral Video: ఈ ఆటోడ్రైవర్ తెలివి ముందు ఇంజనీర్లు కూడా సరిపోరుగా.. ఎండలు మండిపోతున్నాయని ప్రయాణీకుల కోసం..!

ABN , First Publish Date - 2023-06-01T11:41:52+05:30 IST

సోషల్ మీడియా (Social Media) వేదికగా ప్రతిరోజు చాలా వీడియో వైరల్ అవుతుంటాయి.

Viral Video: ఈ ఆటోడ్రైవర్ తెలివి ముందు ఇంజనీర్లు కూడా సరిపోరుగా.. ఎండలు మండిపోతున్నాయని ప్రయాణీకుల కోసం..!

Viral Video: సోషల్ మీడియా (Social Media) వేదికగా ప్రతిరోజు చాలా వీడియో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్ కోసం చేసినవి అయితే, మరికొన్ని టాలెంట్‌ను నిరూపించేవి ఉంటాయి. ఇదిగో ఇదే కోవకు చెందిన ఓ ఆటో తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారు 'అరే.. ఈ ఆటోడ్రైవర్ తెలివి ముందు ఇంజనీర్లు కూడా సరిపోరుగా' అని అంటున్నారు. ఇక భానుడి భగభగల నుంచి ప్రయాణీకులను కాపాడేందుకు ఆ ఆటోడ్రైవర్ కూసింత వెరైటీగానే ఆలోచించాడనడంలోనూ ఎలాంటి సందేహం లేదు.

వివరాల్లోకి వెళ్తే.. రోడ్డుపై సడన్‌గా ఓ ఆటో వెళ్తోంది. దాన్ని జనాలు వింతగా చూస్తున్నారు. అలా చూడడమే కాదు నిజంగా ఆటోడ్రైవర్ 'తోపురా బై..' అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. అతని తెలివి ముందు ఇంజనీర్లు కూడా సరిపోరుగా అని అనుకుంటున్నారు. ఇంతలా వారిని ఆ ఆటో ఆకట్టుకోవడానికి కారణం దాని ప్రత్యేకత. అవును మీరు విన్నది నిజమే. వేసవి తాపంతో అల్లాడిపోతున్న ప్రయాణీకుల కోసం ఆ ఆటోడ్రైవర్ కొంచెం వెరైటీగా ఆలోచించాడు. ఆటో వెనుకవైపు ఓ గ్లాస్ బిగించి, దానికి ఓ కూలర్‌ను (Cooler) కూడా అమర్చాడు. అలా తన ఆటోలో ప్రయాణిస్తున్న వారికి చల్లదనాన్ని అందిస్తున్నాడు ఆ ఆటోవాలా. ప్రస్తుతం ఈ ఆటో తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాలో ఈ వీడియోకు ఇప్పటివరకు ఏకంగా 3లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'వేసవిలో కూడా చల్లటి అనుభూతి' అని ఒకరు, 'బ్రదర్ కూడా పబ్లిక్ గురించి ఆలోచించాడు' అని మరోకరు కామెంట్ చేశారు.

మీ అమ్మాయికి కడుపునొప్పి వస్తోందట.. వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లండంటూ నీట్ కోచింగ్ సెంటర్ నుంచి ఫోన్.. డాక్టర్లు చెప్పింది విని..!

Updated Date - 2023-06-01T11:41:58+05:30 IST