Independence Day: భారత్‌లో మాత్రమే కాదండోయ్.. ఆగస్టు 15న ఆ 4 దేశాల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!

ABN , First Publish Date - 2023-08-14T17:01:34+05:30 IST

ఆగస్టు 15కేవలం మన భారతదేశానికి మాత్రమే గొప్పరోజు కాదు, మనతోపాటు ఇంకొక 4దేశాలకు ఇది స్వేచ్చను పొందిన రోజు. బానిస సంకెళ్ళను తెంచుకుని విముక్తి పొందినరోజు.

Independence Day: భారత్‌లో మాత్రమే కాదండోయ్.. ఆగస్టు 15న ఆ 4 దేశాల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!

ఆగస్టు 15 అనగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చినరోజు అని ఠక్కున చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు. 1947, ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి బ్రిటీష్ పాలకుల నుండి విముక్తి లభించిందనేమాట అందరికీ తెలిసిందే. ఇందుకే ప్రతి సంవత్సరం ఆగస్ఠు 15వ తేదీన దేశమంతా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. అయితే ఆగస్టు 15కేవలం మన భారతదేశానికి మాత్రమే గొప్పరోజు కాదు, మనతోపాటు ఇంకొక 4దేశాలకు ఇది స్వేచ్చను పొందిన రోజు. బానిస సంకెళ్ళను తెంచుకుని విముక్తి పొందినరోజు. భారతదేశంతో పాటు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న మరొక 4దేశాలేవో తెలుసుకుంటే..

ఉత్తర, దక్షిణ కొరియా..(North Korea, South Korea)

ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు జపాన్ బానిసత్వంలో ఏళ్ళకేళ్ళుగా మగ్గిపోయాయి. స్వాతంత్య్రం కోసం పోరాడాయి. వీరి అలుపులేని పోరాటాల ఫలితంగా 1945, ఆగస్టు 15వ తేదీన జపాన్ పాలన నుండి విముక్తి లభించింది. నిజానికి అమెరికన్, సోవియన్ సైన్యం కలిసి కొరియాపై జపాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా యుద్దంచేసి జపాన్ ను అణిచివేశాయి. 1945లో స్వాతంత్య్రం లభించినా 1948లో ఈ కొరియా దేశం ఉత్తర, దక్షిణ కొరియాగా విభజించబడింది. ఇలా కొరియా భారతదేశానికంటే ముందే బానిసత్వపు సంకెళ్లు తెంచుకుంది.

White Hair: ఏవి పడితే వాటిని వాడకండి.. కెమికల్స్‌కు బదులుగా వీటిని వాడితే తెల్లజుట్టు నల్లగా మారిపోవడం ఖాయం..!



బహ్రెయిన్..(Bahrain)

భారతదేశం లాగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం పొందిన మరొక దేశం బహ్రెయిన్. ఇది 1971లో బ్రిటీష్ పాలకుల బానిసత్వం నుండి విముక్తి చెంది స్వాతంత్య్రాన్ని సాధించుకుంది. అయితే పేరుకు స్వాతంత్య్రం వచ్చిందన్నమాటే కానీ బహ్రెయిన్, అరేబియా, పోర్చుగల్ తో సహా అనేక ద్వీపాలను బ్రిటీష్ పాలకులు పాలించారు. చాలా ఆలస్యంగా ఈ ప్రాంతాలలో మార్పు వచ్చి, బ్రిటీష్ ఆధిపత్యం తగ్గింది.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో..(Democratic Republic of the Congo)

రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశం కూడా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ దేశం 1960లో ఆగస్టు 15న ఫ్రాన్స్ నుండి పూర్తీగా స్వాతంత్య్రంగా ప్రకటించబడింది. ఇది ఆఫ్రికా ఖండం మధ్యలో ఉన్న దేశం.

లిచెన్ స్టెయిన్..(Liechtenstein)

లిచెన్ స్టెయిన్ ప్రపంచంలో ఆరవ అతిచిన్న దేశం. ఈ దేశానికి కూడా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం వచ్చింది. స్వతంత్య్రానికి ముందు ఈ దేశం జర్మనీ ఆధీనంలో ఉండేది. భారతదేశం కంటే ఎన్నో రెట్లు చిన్నదైన ఈ దేశం భారతదేశానికంటే ముందే 1940, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం సంపాదించింది. అప్పటి నుండి ఈ దేశ ప్రజలు ఆగస్టు 15ను ప్రత్యేకదినంగా జరుపుకుంటున్నారు.

Apple: యాపిల్స్‌ను కట్ చేయగానే.. నిమిషాల్లోనే రంగు మారిపోతున్నాయా..? మీరు చేయాల్సిన పనేంటం

Updated Date - 2023-08-14T17:03:25+05:30 IST