Apple: యాపిల్స్‌ను కట్ చేయగానే.. నిమిషాల్లోనే రంగు మారిపోతున్నాయా..? మీరు చేయాల్సిన పనేంటంటే..!

ABN , First Publish Date - 2023-08-14T11:18:11+05:30 IST

యాపిల్ కట్ చేసిన తరువాత ఆ ముక్కలు గంటలతరబడి తాజాగా, రంగు మారకుండా, రుచిలో కూడా ఏమాత్రం తేడా లేకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరి..

Apple: యాపిల్స్‌ను కట్ చేయగానే.. నిమిషాల్లోనే రంగు మారిపోతున్నాయా..? మీరు చేయాల్సిన  పనేంటంటే..!

రోజుకొక యాపిల్ తింటే ఎలాంటి అనారోగ్యం దరిచేరదు అన్నది పోషకాహార నిపుణుల మాట. దీనికి తగ్గట్టుగానే యాపిల్ పండులో బోలెడు పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. ఎర్రగా ఆకర్షించే ఈ పండును కట్ చేస్తే లోపల తెల్లగా, జ్యూసీగా ఉంటుంది. పిల్లల కోసం, ఇంట్లోవారికోసం యాపిల్ ముక్కలు చేసి బాక్స్ లో సర్థి ఇస్తుంటారు. కానీ యాపిల్ కట్ చేసిన కొద్దిసేపటికే రంగు మారిపోతుంది. యాపిల్స్ లో ఉండే ఎంజైమ్ లు గాలితో చర్య జరపడం వల్ల యాపిల్స్ రంగు మారిపోతాయి. ఇది చాలా సహజమైన ప్రక్రియ, కానీ ఇలా రంగుమారిపోయిన యాపిల్స్ చూడటానికి కాస్త ఎబ్బెట్టుగానూ, తినడానికి అంతగా ఆసక్తిగా అనిపించదు కూడా. అలా కాకుండా యాపిల్ కట్ చేసిన తరువాత కొన్ని గంటలపాటూ తెల్లగా, తాజాగా ఉంటే చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. కట్ చేసిన తరువాత యాపిల్స్ గంటలతరబడి రంగు, రుచి మారకుండా ఉండాలంటే ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలి.

నిమ్మకాయలు(Lemons) అన్ని తరగతుల ఇళ్ళలో ప్రధానంగా ఉంటాయి. వీటిని ఉపయోగించి కట్ చేసిన తరువాత యాపిల్ రంగు మారకుండా చెయ్యవచ్చు. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ యాపిల్ రంగు మారకుండా చేస్తుంది. ఇందుకోసం యాపిల్ కట్ చేసేటప్పుడు ప్రతి కటింగ్ కు ముందు కత్తికి నిమ్మరసం రాయాలి. లేదా కట్ చేసిన వెంటనే యాపిల్ ముక్కల మీద నిమ్మరసం రాయాలి. ఇలా చేస్తే చాలాసేపటివరకు యాపిల్ ముక్కలు రంగుమారవు.

యాపిల్ కట్ చేసిన తరువాత రంగు మారకుండా ఉండటానికి ఉప్పు కలిపిన నీరు(salt water) కూడా బాగా ఉపయోగపడుతాయి. కట్ చేసిన తరువాత యాపిల్ ముక్కలను ఉప్పు నీటిలో వేయాలి. కొద్దిసేపు ఉప్పు నీటిలోనే ఉంచాలి. ఆ తరువాత ముక్కలను బయటకుతీసి సాధారణ నీటితో కడిగి ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల యాపిల్ ముక్కల సహజమైన రంగు, రుచి రెండూ అస్సలు మారవు. తాజాగా ఉంటాయి.

Anand Mahindra: నాకిన్నాళ్ళూ ఈ విషయం తెలియదంటూ పేక ముక్క పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇందులో రహస్యమేంటంటే..



యాపిల్ ముక్కలు రంగుమారకుండా చేయడంలో ఐస్ వాటర్(Ice water) కూడా పనిచేస్తాయి. కట్ చేసిన తరువాత యాపిల్ ముక్కలను ఐస్ వాటర్ లో వేయాలి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లనీటిలో నుంచి బయటకు తీసి ఆరబెట్టాలి. ఆరిపోయిన తరువాత ఈ ముక్కలను యథావిధిగా తినొచ్చు. ఇవి గంటల తరబడి రంగుమారకుండా ఉంటాయి.

చాలాచోట్ల నిమ్మరసానికి ప్రత్యామ్నాయంగా వెనిగర్(vinegar) ను ఉపయోగిస్తుంటారు. ఈ వెనిగర్ యాపిల్ ముక్కల రంగు మారకుండా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందుకోసం నీళ్ళలో కొద్దిగా వెనిగర్ కలపాలి. కట్ చేసిన యాపిల్ ముక్కలను ఈ నీళ్ళలో వేయాలి. దీనివల్ల యాపిల్స్ రంగు చాలాసేపు సహజంగా, తాజాగా ఉంటుంది. రుచి కూడా కట్ చేసినప్పుడు ఎలా ఉండేదో అలా ఉంటుంది.

కట్ చేసిన యాపిల్స్ ముక్కలను 10-12 గంటల పాటు తాజాగా ఉంచాలనుకుంటే యాపిల్స్ తొక్క తీయకూడదు. కత్తిరించిన వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్ లో ప్యాక్ చేయాలి. యాపిల్ ముక్కలను ప్లాస్టిక్ ర్యాప్ లో చుట్టాలి.

Papaya Seeds: అమ్మ బాబోయ్.. బొప్పాయి గింజలతో ఇన్ని లాభాలా..? తెలియక ఎన్ని సార్లు పారేసి ఉంటారో..!


Updated Date - 2023-08-14T11:18:11+05:30 IST