White Hair: ఏవి పడితే వాటిని వాడకండి.. కెమికల్స్‌కు బదులుగా వీటిని వాడితే తెల్లజుట్టు నల్లగా మారిపోవడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-08-14T15:40:01+05:30 IST

తెల్లజుట్టు వద్దన్నా వినకుండా వచ్చేస్తుంది. దాన్ని ఆపడం ఈ కాలంలో ఎవరికీ సాధ్యం కావడంలేదు. తెల్లజుట్టు కవర్ చేయడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఇందుకోసం అధికశాతం మంది హెయిర్ డై(Hair dye) ఉపయోగిస్తారు. హెయిర్ డైలలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులు ఈ ఒక్క పని చేస్తే..

White Hair: ఏవి పడితే వాటిని వాడకండి.. కెమికల్స్‌కు బదులుగా వీటిని వాడితే తెల్లజుట్టు నల్లగా మారిపోవడం ఖాయం..!

తెల్లజుట్టు వద్దన్నా వినకుండా వచ్చేస్తుంది. దాన్ని ఆపడం ఈ కాలంలో ఎవరికీ సాధ్యం కావడంలేదు. తెల్లజుట్టు కవర్ చేయడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఇందుకోసం అధికశాతం మంది హెయిర్ డై(Hair dye) ఉపయోగిస్తారు. హెయిర్ డైలలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టును బలహీనపరచడమే కాకుండా మెదడు నరాలను దెబ్బతీస్తాయి. అల్డీమర్స్, మతిమరుపు వంటి మెదడు సంబంధిత వ్యాధులు రావడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. హెయిర్ డై కంటే హెన్నా(Henna) ఉపయోగించడం ఎంతో మంచిది. అయితే హెన్నా అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా మారకపోగా ఎర్రగా అవుతుంది. దీనివల్ల చాలామంది హెన్నా అంటే అసహనం వ్యక్తం చేస్తుంటారు. అలా కాకుండా జుట్టు నల్లగా తుమ్మెద రెక్కల్లా మారాలంటే హెన్నా పేస్ట్ తయారుచేసుకోవడం నుండి, దాన్ని అప్లై చేయడం వరకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుంటే..

ఒక ఇనుప బాండీ(iron pan) తీసుకోవాలి. ఇందులో 4నుండి 5 స్పూన్ల హెన్నా పౌడర్(henna powder) వేయాలి. డవలప్ చేసిన హెన్నా పౌడర్ కాకుండా నేచురల్ హెన్నా పౌడర్(natural henna powder) ఎంచుకుంటే జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది. ఇందులో రెండు స్పూన్ల బ్లాక్ టీ(black tea) పౌడర్ వేయాలి. ఈ బ్లాక్ టీ పౌడర్ బదులుగా బ్లాక్ టీని బాగా ఉడికించి ఆ డికాక్షన్ కూడా ఉపయోగించవచ్చు. బ్లాక్ టీ డికాక్షన్ ను హెన్నాలో వేసిన తరువాత ఇందులో అర టీస్పూన్ నిమ్మరసం(lemon juice) కలపాలి. ఈ మూడింటిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇలా హెన్నా పేస్ట్ ను తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను 8గంటపాటు అలాగే ఉంచాలి. లేదా రాత్రి సమయంలో దీన్ని తయారుచేసి రాత్రంతా అలాగే ఉంచాలి.

Independence Day: జాతీయ జెండాతో జర జాగ్రత్త.. ఈ మిస్టేక్స్ కనుక చేస్తే జైలుకెళ్లడం ఖాయం..!



మరుసటి రోజు పేస్ట్ చేసుకున్న హెన్నాను మళ్లీ బాగా మిక్స్ చేసి దీన్ని జుట్టు కుదుళ్లకు, జుట్టు పాయలుగా విడదీస్తూ పొడవునా అప్లై చెయ్యాలి. ఈ హెన్నాను దాదాపు గంటసేపుకు పైగా అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత తలస్నానం చెయ్యాలి. అయితే షాంపూ ఉపయోగించకూడదు, అలాగని వేడినీటిని కూడా హెన్నాను తొలగించడానికి ఉపయోగించకూడదు, కేవలం సాధారణ నీటిని మాత్రమే ఉపయోగించాలి. ఇలా సాధారణ నీటితో హెన్నా తొలగించిన మరుసటిరోజు గాఢత లేని షాంపూతో తల శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తేనే జుట్టుకు అంటిన నలుపు రంగు వెంటనే వెలసిపోకుండా దృఢంగా జుట్టును అంటిపెట్టుకుని ఉంటుంది. ఈ హెన్నా నెలకు రెండుసార్లు అప్లై చేయవచ్చు. దీనివల్ల హెయిర్ డైలు అవసరం లేకుండానే జుట్టు తొందర్లోనే నల్లగా నిగనిగలాడుతుంది.

జుట్టుకు మరింత మంచి పోషణ, జుట్టు పెరుగుదల కావాలని అనుకునేవారు గోరింటాకు పొడితో పాటు భృంగరాజ్ పొడి, ఉసిరికాయ పొడి కూడా మిక్స్ చేసుకోవాలి. ఇవి జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. జుట్టు కుదుళ్ల PH స్టాయిలను సమతుల్యంగా ఉంచుతాయి. జుట్టు కుదుళ్లలో అధికంగా ఉత్పత్తి అయ్యే నూనెను నియంత్రిస్తాయి. జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. జుట్టు రాలడమనే సమస్య వీటి వల్ల పరిష్కారమవుతుంది. అంతేకాదు జుట్టు మృదువుగా, సిల్కీగా ఉంటుంది. తలలో చుండ్రు, పుండ్లు వంటి సమస్యలు కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి.

Apple: యాపిల్స్‌ను కట్ చేయగానే.. నిమిషాల్లోనే రంగు మారిపోతున్నాయా..? మీరు చేయాల్సిన పనేంటంటే..!


Updated Date - 2023-08-14T15:40:01+05:30 IST