Viral News: ఎక్కడో ఉండాల్సిన యువతి.. ఒక్క నిర్ణయంతో చివరకిలా.. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్‌లో ఉన్న ఈ యువతి ఎవరో.. ఆమె కథేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-04-13T19:14:30+05:30 IST

పరిస్థితులు ఎప్పుడు ఎవరినీ ఎలా మార్చేస్తాయో చెప్పలేం.

Viral News: ఎక్కడో ఉండాల్సిన యువతి.. ఒక్క నిర్ణయంతో చివరకిలా.. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్‌లో ఉన్న ఈ యువతి ఎవరో.. ఆమె కథేంటో తెలిస్తే..

Viral News: పరిస్థితులు ఎప్పుడు ఎవరినీ ఎలా మార్చేస్తాయో చెప్పలేం. కోల్‌కతాకు (Kolkata) చెందిన ఓ యువతి విషయంలో ఇదే జరిగింది. అప్పటివరకు ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా (Fashion Designer) మంచి జాబ్‌లో ఉంది. కానీ, ఉన్నట్టుండి ఇప్పుడు రోడ్డు పక్కన ఓ చిన్న ఫుడ్‌స్టాల్‌లో పని చేస్తోంది. దీంతో ఆ యువతి స్టోరీ తెలుసుకున్న కొందరు దాన్ని సోషల్ మీడియాలో (Social Media) పెట్టడంతో వైరల్‌ అవుతోంది. అసలు ఆ యువతి విషయంలో ఏం జరిగింది? అంతలా పరిస్థితులు ఆమెను ఎలా ప్రభావితం చేశాయి? తదితర విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఆమె పేరు నందిని గంగూలీ (Nandini Ganguly). వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతా వాసి. ఉన్నత చదువులు చదివిన నందిని.. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్‌గా మంచి జాబ్ కూడా సంపాదించింది. కానీ, ఉన్నట్టుండి చేస్తున్న జాబ్ (Job) వదిలేసి రోడ్డు పక్కన ఓ ఫుడ్‌స్టాల్‌లో పని చేయడం మొదలెట్టింది. దీనికి కారణం ఆమె తండ్రికి ఉన్న రబ్బర్ బిజినెస్. కరోనా సమయంలో తండ్రి బిజినెస్ తీవ్రంగా దెబ్బతింది. దాంతో నందిని తల్లిదండ్రులు (Parents) రోడ్డుపక్కన చిన్న ఫుడ్‌స్టాల్ ఏర్పాటు చేశారు. వారికి చేదొడుగా ఉండాలని నిశ్చయించుకున్న నందిని.. వెంటనే తాను చేస్తున్న జాబ్ వదిలేసి ఫుడ్‌స్టాల్‌లో పని చేయడం మొదలెట్టింది.

Viral Video: ఆమెతో మాట్లాడాలి.. ఎవరైనా వెళ్లి నాకు ఫోన్ చేయించండంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఇంతకీ ఈమె ఎవరంటే..!

అయితే, ఆమెకు వంటలు చేయడం బాగా తెలుసు. అందుకే ఇష్టమైన పని ఎంచుకున్నానని చెబుతుందని ఆమెను పలకరించివారు చెబుతున్నమాట. ప్రస్తుతం ఆమె తన ట్రేడ్‌మార్క్ బెంగాలీ ట్రేడిషనల్ థాలీ‌తో (Bengali Traditional Thali) ప్రతిరోజు ఫుడ్‌స్టాల్‌కు భారీ మొత్తంలో భోజన ప్రియులను రప్పిస్తోంది. ఇక వెజ్ థాలీ ధర రూ. 30, ఫిష్ థాలీ ధర రూ. 70, మటన్ థాలీ ధర రూ. 100గా ఉన్నాయట. మరోవైపు ఫ్యాషన్ డిజైనింగ్‌పై కూడా దృష్టిసారిస్తుందట. ఇక ఆమె కథ తెలుసుకున్న కొందరు ఔత్సాహికులు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఫుడ్ వ్లాగ్గర్ స్ఫూర్తిదాయకమైన కథ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Viral Video: పెళ్లి వేడుకలో కలకలం.. పరుగులు తీసిన బంధువులు.. వధూవరులిద్దరూ ఫొటోలకు ఫోజులిస్తోంటే సడన్‌గా ఇలా జరిగిందేంటి..?


Updated Date - 2023-04-13T19:14:30+05:30 IST