Viral Video: ఆమెతో మాట్లాడాలి.. ఎవరైనా వెళ్లి నాకు ఫోన్ చేయించండంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఇంతకీ ఈమె ఎవరంటే..!

ABN , First Publish Date - 2023-04-12T18:18:22+05:30 IST

సోషల్ మీడియాలో (Social Media) ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే విషయాలు.. వాటి తాలూకు ఫొటోలు, వీడియోలు సమ్‌థింగ్ స్పెషల్‌గా (Something Sepecial) ఉంటాయనే విషయం తెలిసిందే.

Viral Video: ఆమెతో మాట్లాడాలి.. ఎవరైనా వెళ్లి నాకు ఫోన్ చేయించండంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఇంతకీ ఈమె ఎవరంటే..!

Viral Video: సోషల్ మీడియాలో (Social Media) ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే విషయాలు.. వాటి తాలూకు ఫొటోలు, వీడియోలు సమ్‌థింగ్ స్పెషల్‌గా (Something Sepecial) ఉంటాయనే విషయం తెలిసిందే. ఇదే కోవలో ఆయన తాజాగా మరో సమ్‌థింగ్ స్పెషల్‌ వీడియోను ట్విటర్‌లో (Twitter) పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ మహిళ కనిపిస్తుంది. ఆమె బస్టాండ్‌లో ప్రయాణికులు పారేసిన చెత్తను పొగుచేసి పక్కనే ఉన్న ఓ చెత్తడబ్బాలో వేయడం మనం వీడియోలో చూడొచ్చు. ఆ మహిళ చేసిన ఆ పని మహీంద్రాకు విపరీతంగా నచ్చడంతో ఆమెతో మాట్లాడాలి.. ఎవరైనా వెళ్లి నాకు ఫోన్ చేయించండంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు. దాంతో ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral Video) అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరు? అసలు ఈ ఘటన ఎక్కడిది? ఆనంద్ మహీంద్రా దృష్టికి ఎలా వచ్చింది? తదితర వివరాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

అసలు ఈ వీడియోను మొదట పోస్ట్ చేసింది ఆదర్శ్ హెగ్డే అనే ట్విటర్ యూజర్ (@adarshahgd). ఈ నెల 10వ తేదీన ఆదర్శ్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. దీనికి ఆయన.. వీడియోలో ఉన్న మహిళ కర్నాటకలోని అంకోలా బస్టాండ్‌లో ఫ్రూట్స్ విక్రయించే మహిళగా పేర్కొన్నాడు. ఆమె తాను కస్టమర్లకు అమ్మే పండ్లను ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ఆకులలో చుట్టి ఇస్తోంది. అలా ఆమె వద్ద పండ్లు కొన్న వినియోగదారులు వాటిని తిన్న తర్వాత వాటితో పాటు ఇస్తున్న ఆకులను అలాగే బస్టాండ్‌లో ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారు. అది గమనించిన ఆమె వాటిని సేకరించి తీసుకెళ్లి చెత్తబుట్టాలో వేస్తుంది. 'అది ఆమె పని కాదు. అయినా ఆమె ఒక బాధ్యతగా ఆపని చేయడం నిజంగా హ్యాట్సాఫ్' అంటూ.. ఆదర్శ్ హెగ్డే ట్వీట్ చేశాడు.

Viral News: సతీసావిత్రి మళ్లీ పుట్టింది.. భర్త ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డేసింది.. మొసలితో పోరాడి మరీ..!


ఇదే ట్వీట్‌ను ఆనంద్ మహీంద్రా 'రియల్ హీరో కీపింగ్ భారత్ స్వచ్ఛ్' (Real Hero Keeping Bharat Swach) అనే క్యాప్షన్‌తో రిట్వీట్ చేశారు. నిజంగా ఆమె చేస్తున్న పని చాలా మంచిది. ఆమె చేసిన పని గుర్తింపు లేకుండా పోకూడదు. తప్పనిసరిగా ఆమె ప్రయత్నాన్ని మనం ప్రశంసించాల్సిందే. ఆదర్శ్ గారు ఆమె నివసించే ప్రాంతంలో ఎవరైనా మీకు తెలిస్తే.. ఆమెతో మాట్లాడాలి నాకు సహాయం చేయండి. ఎవరైనా వెళ్లి నాకు ఫోన్ చేయించండంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దాంతో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 26వేలకు పైగా లైక్స్, 6లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Shocking Video: పాపులర్ అవాలనుకుని.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. వీడియో తీయండ్రా అంటూ ఫ్రెండ్స్‌కు చెప్పి మరీ..!

Updated Date - 2023-04-12T18:18:22+05:30 IST