Viral Video: పెళ్లి వేడుకలో కలకలం.. పరుగులు తీసిన బంధువులు.. వధూవరులిద్దరూ ఫొటోలకు ఫోజులిస్తోంటే సడన్‌గా ఇలా జరిగిందేంటి..?
ABN , First Publish Date - 2023-04-13T18:07:36+05:30 IST
అప్పటివరకు ఆ పెళ్లి వేడుక ఎంతో ఉత్సాహంగా కొనసాగింది.
Viral Video: అప్పటివరకు ఆ పెళ్లి వేడుక ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కళకళలాడింది. ఒకవైపు వధూవరులిద్దరూ ఫొటోలకు ఫోజులిస్తోంటే.. మరోవైపు పెళ్లికి వచ్చిన వారు డీజే పాటలపై డ్యాన్సులతో ఆనందంగా గడుపుతున్నారు. ఇంతలో ఎవరూ ఊహించని ఓ సంఘటన చోటు చేసుకుంది. దాంతో ఆ పెళ్లి వేడుకలో ఒక్కసారిగా కలకలం రేగింది. అంతే.. పెళ్లికి వచ్చిన బంధువులు పరుగోపరుగు. ఇప్పుడీ పెళ్లి వేడుక తాలూకు వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఆ వివాహ వేడుకలో ఏం జరిగింది? ఉన్నట్టుండి పెళ్లికి వచ్చినవారు ఎందుకలా పరుగులు పెట్టారు? అనే వివరాలు తెలుసుకుందాం.
వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఆ పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరుగుతుంది. ఒకవైపు వధూవరులిద్దరూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. మరోవైపు డీజే ప్లే అవుతుంటే పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు నెమ్మదిగా పావులు కదుపుతున్నారు. అలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరుగుతున్న ఆ వేడుకలో అంతలోనే సడెన్‌గా ఓ సంఘటన జరిగింది. అదేదో వెనుక నుంచి ఎవరో గురి చేసి కొట్టినట్లు వధూవరులిద్దరూ ఫొటోలకు ఫోజులిస్తున్న సమయంలో ఓ డీజే బాక్స్ వచ్చి వారిపై పడింది. ఆ దెబ్బతో వారిద్దరూ నిల్చున్న చోటు నుంచి దూరంగా పరిగెత్తారు. అది చూసిన బంధువులు కూడా అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. ఈ ఘటన ఆ పెళ్లి వేడుకలో ఒక్కసారిగా కలకలం రేపింది. దీని తాలూకు వీడియోను gags.nepal. అనే ఇన్‌స్టాగ్రాం పేజీలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇప్పటికే వీడియోకు 1మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 'డీజే అతను తప్పకుండా ఆ పెళ్లికూతురి మాజీ బాయ్‌ఫ్రెండ్ కావొచ్చని' ఒకరు, అప్పటి వరకు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన 'అబ్ రస్తా మిల్ గయా ఖుషికా కా' అనే సాంగ్‌ను ప్రస్తావిస్తూ మరోకరు కామెంట్ చేశారు.