వైరల్‌గా మారిన పాము ఫొటోలు, వీడియోలు.. పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు.. చివరకు..

ABN , First Publish Date - 2023-01-11T17:31:03+05:30 IST

విచిత్ర ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల చనిపోయిన పాముకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చివరకు ..

వైరల్‌గా మారిన పాము ఫొటోలు, వీడియోలు.. పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు.. చివరకు..

విచిత్ర ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల చనిపోయిన పాముకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చివరకు పోలీసులు ఆ పాముకు పోస్టుమార్టం కూడా నిర్వహించారు. నివేదికలో దాడికి గురై పాము చనిపోయినట్లు తేలడంతో చివరకు కేసులు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Viral Video: ఎండ్రకాయను చూడగానే ఓ పిల్లికి నోరు ఊరగా.. మరో పిల్లి ఎలా ఫీల్ అయిందో మీరే చూడండి..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బాగ్‌పత్ జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బరోట్‌లోని ఛప్రౌలి పరిధి షబ్గా గ్రామంలో ఓ వ్యక్తి జనవరి 7న పామును (snake) చంపడంతో పాటూ దాన్ని తీసుకెళ్లి పడేసే ఘటన మొత్తాన్ని వీడియో తీయించాడు. తర్వాత దాన్ని సోషల్ మీడియాలో (Social media) షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో చివరకు పోలీసుల వరకు వెళ్లింది. దీనిపై అటవీ శాఖ అధికారులు (Forest officials) స్పందించి విచారణకు ఆదేశించారు. చివరకు అటవీ శాఖ సిబ్బంది చనిపోయిన పాముకు పోస్టుమార్టం (Postmortem) నిర్వహించారు. వ్యక్తి దాడి చేయడం వల్లే పాము చనిపోయినట్లు తేలడంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ప్రియుడితో వివాహిత వీడియో కాలింగ్.. అతను రెచ్చగొట్టడంతో.. మధ్యలో ఉన్నట్టుండి ఆమె చేసిన పని..

పాముకు పోస్టుమార్టం నిర్వహించిన ఘటన.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఘటన ఇదేం మొదటిది కాదు. గతంలో బదౌన్ అనే ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఎలుకను (rat) చంపాడని తెలుసుకున్న జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పుడు కూడా ఎలుకకు పోస్టుమార్టం నిర్వహించాల్సి వచ్చింది. ఎలుకను చంపినట్లు తేలడంతో చివరు సదరు వ్యక్తిపై కూడా కేసులు నమోదు చేశారు. కాగా, వైరల్ అవుతున్న పాము వీడియోలు, ఫొటోలపై (Viral photos and videos) నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

హనీమూన్‌లో అర్ధరాత్రి నిద్ర లేచిన భర్త.. భార్య ఏం చేస్తోందో చూద్దామని వెతగ్గా.. ఎదురుగా..

Updated Date - 2023-01-11T17:31:03+05:30 IST