Ram Charan: బన్నీ ‘నో’ చెప్పిన పాత్రకి.. చెర్రీ ‘ఎస్’ చెబుతాడా?

ABN , First Publish Date - 2023-03-05T15:00:57+05:30 IST

‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ పరిస్థితి మారిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎన్నో సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.

Ram Charan: బన్నీ ‘నో’ చెప్పిన పాత్రకి.. చెర్రీ ‘ఎస్’ చెబుతాడా?

‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ పరిస్థితి మారిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎన్నో సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి. అందులో తమిళ దర్శకుడు అట్లీ (Atlee), బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కాంబోలో తెరకెక్కుతున్న ‘జవాన్’ (Jawan) మూవీ ఒకటి. ఈ చిత్రంతోనే నయన తార బాలీవుడ్‌కి పరిచయం కాబోతోంది. అయితే.. అందరిలాగే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ కోసం ఈ సినిమాలో ఓ సౌత్ హీరోతో క్యామియో చేయించాలని అట్లీ గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు.

ఆ పాత్రని తమిళ నటుడు దళపతి విజయ్ చేస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్‌ నుంచి విజయ్ తప్పుకున్నాడు. అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun)కి ఇటీవలే అట్లీ కథ వినిపించడని న్యూస్‌ వచ్చిన సంగతి తెలిసిందే. బన్నీ ఆ పాత్ర చేయడానికి కచ్చితంగా ఒప్పుకుంటాడని మూవీ టీం గట్టిగానే ఆశలు పెట్టుకుంది. అయితే స్టైలిష్ స్టార్ మాత్రం చేయలేనని చెప్పేశాడట. బన్నీ ప్రస్తుతం ‘పుష్ప 2’ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర కోసం గడ్డం మెయింటెన్ చేయాల్సి ఉంది. కానీ.. జవాన్ సినిమాలో పాత్ర కోసం లుక్ మార్చాల్సిన అవసరం ఉండడంతో అట్లీకి బన్నీ నో చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ తరుణంలోనే ‘జవాన్’ మరో క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. అదే ఈ చిత్రంలో క్యామియో కోసం రామ్‌చరణ్‌ (Ram Charan)ని ఆ చిత్రబృందం సంప్రదించినట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’తో వచ్చిన ఫేమ్ దృష్ట్యా చెర్రీ ఈ పాత్ర చేస్తే ప్రపంచవ్యాప్తంగా ప్లస్ అవుతుందని అట్లీ భావిస్తున్నాడట. అంతేకాకుండా.. ఈ క్యామియోని కచ్చితంగా సౌతిండియాకి స్టార్ హీరోతో చేయించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అయితే.. బన్నీ నో చెప్పిన పాత్రకి చెర్రీ ఎస్ చెబుతాడో లేదో చూడాలి మరి. కాగా.. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఆర్‌సీ 15’ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-05T15:34:55+05:30 IST