TS BJP : అమిత్‌షా తెలంగాణ టూర్‌తో సడన్‌గా తెరపైకి పొంగులేటి, జూపల్లి పేర్లు.. ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2023-04-22T23:12:12+05:30 IST

తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయా..? ఖమ్మం జిల్లాలో కాంట్రాక్టర్ కమ్ పొలిటీషియన్‌గా పేరుగాంచిన..

TS BJP : అమిత్‌షా తెలంగాణ టూర్‌తో సడన్‌గా తెరపైకి పొంగులేటి, జూపల్లి పేర్లు..  ఏం జరుగుతుందో..!?

తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయా..? ఖమ్మం జిల్లాలో కాంట్రాక్టర్ కమ్ పొలిటీషియన్‌గా పేరుగాంచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy).. మహబూబ్ నగర్ జిల్లాలో బడా నాయకుడిగా, సీనియర్ నేతగా పేరున్న జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకోబోతున్నారా..? ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందా..? అంటే బీజేపీ శ్రేణులు అవుననే చెబుతున్నాయి. ఇంతకీ ఈ ఇద్దరూ ఏమనుకుంటున్నారు..? కేడర్ ఏమనుకుంటోంది..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.

Ponguleti-and-jupally.jpg

ఎక్కడ చూసినా ఇదే చర్చ..!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పొంగులేటి, జూపల్లి గురించే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ (BRS) నుంచి వేటు పడిన తర్వాత ఈ ఇద్దరూ భవిష్యత్ కార్యాచరణపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. అయితే బీజేపీ, కాంగ్రెస్ (Congress) పార్టీల నుంచి మాత్రం ఇద్దరికీ ఆహ్వానం అందిన విషయం మాత్రం వాస్తవమే. రెండూ జాతీయ పార్టీలు కావడంతో ఏ పార్టీలో చేరితే పరిస్థితి ఎలా ఉంటుందో.. కేడర్ కలిసి నడుస్తుందా..? లేకుంటే హ్యాండిస్తుందా..? అని ఆలోచనలో పడ్డారట. సరిగ్గా ఇదే టైమ్‌లో అటు బీజేపీ నుంచి.. ఇటు కాంగ్రెస్ నుంచి కొందరు ముఖ్య నేతలు మాట్లాడుతూ.. ఆ ఇద్దరూ తమకు మంచి సన్నిహితులేనని, ఏ పార్టీలో చేరుతారో చూద్దామన్నట్లుగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ ఇద్దరి గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఇద్దర్నీ ఆహ్వానించేశారు కూడా. మరోవైపు అటు పొంగులేటి.. ఇటు జూపల్లి కేడర్ కూడా కాంగ్రెస్‌లోనే చేరితే భవిష్యత్తు ఉంటుందని ఒత్తిడి తెస్తోందని వార్తలు ఇప్పటికే చాలాసార్లు వచ్చాయి. అయితే.. పొంగులేటి చూపు మాత్రం బీజేపీ వైపు ఉన్నట్లుగా తెలియవచ్చింది. ఇక జూపల్లి మాత్రం కేడర్ చెప్పినట్లే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి.

Congress-BJP.jpg

ఇప్పుడెందుకీ చర్చ..!

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) ఆదివారం నాడు హైదరాబాద్‌‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ శివారులోని చేవెళ్లలో జరిగే పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన సమావేశంలో షా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను బీజేపీ ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు.. ఈ సందర్భంగా షా సమక్షంలో పలువురు కీలక నేతలను పార్టీలో చేర్పించాలని రాష్ట్ర నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు ముఖ్యనేతలు బీజేపీలో చేరడానికి సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. పొంగులేటి, జూపల్లి కూడా బీజేపీలో చేరేలా ముఖ్యనేతలంతా విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. షా పర్యటనతో మరోసారి ఈ ఇద్దరి గురించి తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరి చేరిక కోసం చాలా రోజులుగా ఢిల్లీలోని బీజేపీ పెద్దలు కూడా ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. అయితే.. షా పర్యటనలో చేరడమా..? లేకుంటే మరో రెండు మూడ్రోజుల్లో పొంగులేటి, జూపల్లి చేరికపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని తెలంగాణ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో అభిమానులు ఏం జరుగుతుందో అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Amit-Shah-Telangana-Tour.jpg

మొత్తానికి చూస్తే.. షా పర్యటనతో పొంగులేటి, జూపల్లి వ్యవహారం మరోసారి చర్చకొచ్చింది. అయితే.. కాంగ్రెస్ కూడా పొంగులేటిని పార్టీలో చేర్చుకుని ఎంపీ సీటుతో పాటు, అడిగిన అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉందట. ఇక ఎలాగో జూపల్లి ప్రస్థానం కాంగ్రెస్ నుంచే కాబట్టే ఆయనకు కూడా కండువా కప్పి ప్రాధాన్యత ఉన్న పదవి ఇవ్వడంతో పాటు రానున్న ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరూ కాషాయ తీర్థం పుచ్చుకుంటారా.. లేకుంటే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా..? అనేది తేలాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Viveka Murder Case : వివేకా హత్య కేసులో ఎవరూ ఊహించని వ్యక్తిని విచారించిన సీబీఐ.. రెండు గంటలపాటు ప్రశ్నల వర్షం..!

******************************

Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణలో కొత్తకోణం.. సడన్‌గా ఆయన సీబీఐ ఆఫీసులో ప్రత్యక్షమవ్వడంతో..


******************************

YS Jagan Reddy : ప్చ్.. వైసీపీలో అంతా అయోమయం.. సడన్‌గా ఇంత మౌనమెందుకో.. భయం మొదలైందా..!?


******************************

BRS No Bidding : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేసీఆర్ సర్కార్ బిడ్ వేయకపోవడం వెనుక పెద్ద కథే ఉందిగా.. గులాబీ బాస్ కంగుతిన్నారా..!?

******************************

Etela Vs Revanth : ప్రమాణానికి భాగ్యలక్ష్మి గుడికెళ్లి రేవంత్ కంటతడి.. ఇంట్లోనే ఉండిపోయిన ఈటల చెప్పే లాజిక్ ఏమిటంటే..


******************************

Updated Date - 2023-04-22T23:17:30+05:30 IST