Viveka Murder Case : వివేకా హత్య కేసులో ఎవరూ ఊహించని వ్యక్తిని విచారించిన సీబీఐ.. రెండు గంటలపాటు ప్రశ్నల వర్షం..!

ABN , First Publish Date - 2023-04-22T22:16:31+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) ఊహించని మలుపులు తిరుగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని..

Viveka Murder Case : వివేకా హత్య కేసులో ఎవరూ ఊహించని వ్యక్తిని విచారించిన  సీబీఐ.. రెండు గంటలపాటు ప్రశ్నల వర్షం..!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) ఊహించని మలుపులు తిరుగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar Reddy) సీబీఐ (CBI) అరెస్ట్ చేశాక ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది. తర్వాత ఎవర్ని విచారకు పిలుస్తారు..? ఇంకెవర్ని అరెస్ట్ చేశారు..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వివేకా కేసు విచారణను ఏప్రిల్ 30 లోపు పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీం కోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. దీంతో సీబీఐ దూకుడు పెంచింది. అవినాష్‌కు నోటీసులు ఇవ్వడం, అరెస్ట్ చేయకుండా ఆపాలని ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును (TS High Court) ఆశ్రయించడం.. బెయిల్ మంజూరు కావడం, ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణకు వెళ్తుండటం.. మధ్యలో మళ్లీ వైఎస్ సునీతారెడ్డి (YS Sunitha Reddy) ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం ఒకటా రెండా ఎన్నో కీలక పరిణామాలు రోజుల వ్యవధిలోనే చోటుచేసుకున్నాయి. సరిగ్గా ఇదే టైమ్‌లో ఎవరూ ఊహించని ఒక వ్యక్తి సీబీఐ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు.

Sunitha-Reddy-and-Husband.jpg

రెండు గంటలపాటు ప్రశ్నల వర్షం..!

కేసులో సూత్రదారులెవరు..? పాత్రదారులెవరు..? అనేది తేల్చాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని వైఎస్ సునీతారెడ్డి చిన్నస్థాయి కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వెళ్లారు. అటు కేసుపై కోర్టులో విచారణ.. ఇటు వ్యక్తులను సీబీఐ విచారిస్తుండగా.. హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీసులో రాజశేఖర్ రెడ్డి (Sunitha Husband Rajasekhar Reddy) ప్రత్యక్షమయ్యారు. వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి భర్తే రాజశేఖర్ రెడ్డి. బహుశా ఈయన విచారణకు వస్తారని ఎవరూ ఊహించి ఉండరేమో. అయితే ఆయన సడన్‌గా ఎందుకొచ్చారు..? అధికారులతో మాట్లాడటానికి వచ్చారా..? లేకుంటే ఆయనకు సీబీఐ నుంచి నోటీసులు వచ్చాయా..? అనే చర్చ మొదలైంది. అయితే.. శుక్రవారం నాడే రాజశేఖర్ రెడ్డికి 160 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసు జారీ చేసింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. శనివారం నాడు రెండు గంటలపాటు ఆయన్ను సీబీఐ అధికారులు (CBI Officers) ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్‌ను రికార్డ్ చేసిన అధికారులు.. పలు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగా.. మరికొన్ని ప్రశ్నలకు నోరు మెదపలేదట.

Rajasekhar-Reddy.jpg

ఆ ఇద్దరి విచారణ తర్వాతే..!

వరుసగా నాలుగోరోజు వివేకా కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ రెడ్డిలను (Uday Kumar Reddy) సీబీఐ ప్రశ్నించింది. ఇప్పటికే కీలక సమాచారాన్ని వీరి నుంచి అధికారులు సేకరించి.. స్టేట్మెంట్‌ను ఆడియో, వీడియో రికార్డ్ చేసినట్లు తెలియవచ్చింది. ఇవాళ సుమారు ఆరు గంటల పాటు ఈ ఇద్దరినీ సీబీఐ విచారించింది. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు చోటు చేసుకున్న పరిణామాలపై సీబీఐ ఆరా తీసింది. అంతేకాదు.. అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌లపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆదివారం నాడు మరోసారి ఈ ఇద్దర్నీ సీబీఐ కస్టడీలోకి తీసుకోనున్నది. అయితే.. మూడ్రోజులపాటు వరుసగా విచారణకు వచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి.. ఇవాళ మాత్రం సీబీఐ విచారణకు హాజరు కాలేదు. అయితే తనకు సీబీఐ నుంచి ఎలాంటి సమాచారం లేదని ఎంపీ చెబుతున్నారు. అయితే.. సోమవారం నాడు సుప్రీంకోర్టు విచారణ తర్వాత హాజరుపై సీబీఐ నిర్ణయం చెబుతామని అవినాష్ చెబుతున్నారు. ఇవాళ భాస్కర్ రెడ్డి, ఉదయ్ విచారణ తర్వాత రాజశేఖర్ రెడ్డిని సీబీఐ విచారించడంతో.. ఏమని విచారించి ఉండొచ్చు..? ఈ టైమ్‌లోనే ఎందుకు విచారణకు పిలవాల్సి వచ్చింది..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

MP-Avinash-Reddy-Media.jpg

మొత్తానికి చూస్తే.. వివేకా హత్య గురించి మొదట సునీతా భర్త రాజశేఖర్‌కే తెలుసని ఆయన ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు..? అని మొదట్నుంచీ అవినాష్‌ ఆరోపిస్తున్నారు. ఇలా ఒక్కటే కాదు చాలా ఆరోపణలే ఎంపీ చేశారు. నిన్న, మొన్న అవినాష్‌కు నోటీసులు వచ్చినప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి, వివేకా రెండో భార్య షమీమ్ పేర్లు ప్రస్తావనకు తెచ్చారు. అలా ఆరోపణలు చేసిన రోజుల వ్యవధిలోనే రాజశేఖర్ సీబీఐ ఆఫీసులో ప్రత్యక్షమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారంపై అవినాష్, సునీతారెడ్డి, రాజశేఖర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణలో కొత్తకోణం.. సడన్‌గా ఆయన సీబీఐ ఆఫీసులో ప్రత్యక్షమవ్వడంతో..


******************************

YS Jagan Reddy : ప్చ్.. వైసీపీలో అంతా అయోమయం.. సడన్‌గా ఇంత మౌనమెందుకో.. భయం మొదలైందా..!?


******************************

BRS No Bidding : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేసీఆర్ సర్కార్ బిడ్ వేయకపోవడం వెనుక పెద్ద కథే ఉందిగా.. గులాబీ బాస్ కంగుతిన్నారా..!?

******************************

Etela Vs Revanth : ప్రమాణానికి భాగ్యలక్ష్మి గుడికెళ్లి రేవంత్ కంటతడి.. ఇంట్లోనే ఉండిపోయిన ఈటల చెప్పే లాజిక్ ఏమిటంటే..


******************************

Updated Date - 2023-04-23T10:43:22+05:30 IST